మంగళవారం 02 మార్చి 2021
Vikarabad - Feb 01, 2021 , 00:17:40

స్వచ్ఛ పరిగిగా తీర్చిదిద్దుదాం

స్వచ్ఛ పరిగిగా తీర్చిదిద్దుదాం

పరిగి, జనవరి 31 :  స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుదామని మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌ సూచించారు. ఆదివారం పరిగిలోని 15వ వార్డులో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఇంటింటికీ చెత్తబుట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ చెత్తను బుట్టల్లో వేసి  చెత్త సేకరణ వాహనాల్లో వేయాలన్నారు. కార్యక్రమంలో కో-ఆప్షన్‌ సభ్యుడు ముకుంద శేఖర్‌ పాల్గొన్నారు. 

 చెత్త సేకరణ బుట్టల పంపిణీ

 బషీరాబాద్‌, జనవరి 31: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జీవన్గి గ్రామంలో ఆదివారం చెత్త సేకరణ బుట్టలను సర్పంచ్‌ కోటం నవనీత, ఉప సర్పంచ్‌ జగదీశ్‌ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా నవనీత మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలన్నారు. రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా వేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు హరిసూదన్‌రెడ్డి, వార్డు సభ్యుడు నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. 

VIDEOS

logo