ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Jan 31, 2021 , 00:08:54

కరోనా కాలంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

కరోనా కాలంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

  • టీయూడబ్ల్యూజే, ఐజేయూ డైరీ ఆవిష్కరణలో 
  • మంత్రి సబితాఇంద్రారెడ్డి 

వికారాబాద్‌, జనవరి 30 : కరోనా కాలంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవనంలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ సంఘం డైరీని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, జాయింట్‌ కలెక్టర్‌తో మాట్లాడి జర్నలిస్టుల నివాసాల కోసం  కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌,  జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతారెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, వికారాబాద్‌, పరిగి ఎమ్మెల్యేలు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, కొప్పుల మహేశ్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ మోతీలాల్‌, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo