నేడు పల్స్ పోలియో

- వికారాబాద్ జిల్లాలో
- 814 పోలియో బూత్‌లు, 3,272 మంది సిబ్బంది
- 82 మంది రూట్ సూపర్వైజర్లు
- 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఏర్పాట్లు
- జిల్లాలోని 22 పీహెచ్సీలో 1,002,74 మందికి పొలియో చుక్కలు
- ]జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్, ఎంపీ రంజిత్‌రెడ్డి రాక..
- జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుధాకర్‌షిండే రంగారెడ్డి జిల్లాలో..
- 5 ఏండ్ల లోపు చిన్నారులు 3,74,480 మంది
- మొత్తం 1,551 బూత్‌లు, 54 సంచార బృందాలు, 5,342 మంది వైద్య సిబ్బంది
- 153 రూట్స్, 54 ట్రాన్సిట్ కేంద్రాలు
- పర్యవేక్షించనున్న రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు
వికారాబాద్, జనవరి 30, (నమస్తే తెలంగాణ) : పల్స్ పోలియోకు వికారాబాద్ జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 5 ఏండ్లలోపు చిన్నారులు 1,002,74 మంది ఉన్నారు. జిల్లాలో 818 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయడంతో పాటు 82 మంది రూట్ సూపర్వైజర్లను, 22 మంది మెడికల్ ఆఫీసర్లను నియమించారు. జిల్లా దవాఖానతో పాటు అన్ని కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నారు. 3,272 మంది ఆశవర్కర్ల సేవలను వినియోగించుకోనున్నారు. నేడు పోలియో చుక్కలు వేసుకోనివారికి ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వేయనున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో..
షాబాద్, జనవరి 30 : రంగారెడ్డి జిల్లాలో నేడు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లాలో 5 ఏండ్లలోపు చిన్నారులు 3,74,480 మంది ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 418, గ్రామీణ ప్రాంతాల్లో 1,133 కేంద్రాలతో కలిపి 1,551 పల్స్‌పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను 153 రూట్స్, 54 ట్రాన్సిట్ కేంద్రాలు, 207మంది వైద్యాధికారులు, సూపర్వైజర్లు, 54 సంచార బృందాలు కలిపి మొత్తం 5,342 మంది సిబ్బంది పని చేయనున్నారు. హైరిస్క్ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, వ్యవసాయ క్షేత్రాల్లో ఉండే చిన్నారులకూ పోలియో చుక్కలు వేయనున్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు.
అన్ని శాఖల అధికారుల భాగస్వామ్యం..
పల్స్‌పోలియో కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ సిబ్బంది, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ప్రయాణాల్లో ఉన్న వారికి 54 ట్రాన్సిట్ కేంద్రాల నుంచి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, ప్రధాన కూడళ్లలో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాటు చేశారు. ప్రచార సామగ్రి, బ్యానర్లు, పోస్టర్లు, ఆడియో సీడీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశారు. మైకింగ్ వాహనాలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. మహిళాశిశు సంక్షేమశాఖ, పురపాలకశాఖ, విద్యాశాఖ, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఐకేపీ, పోలీస్, ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు చుక్కలు వేయించుకోని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి వికారాబాద్ డీఎంహెచ్‌వో సుధాకర్ షిండే
పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుధాకర్ షిండే తెలిపారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రతి బూత్‌లో నలుగురు సిబ్బంది ఉంటారని, చుక్కలు వేసేవారు, సిరాచుక్క పెట్టేవారు ఉంటారని తెలిపారు. కరోనా నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ప్రతి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ, జడ్పీటీసీలతో పోలియోచుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ప్రతి పీహెచ్సీలో మొబైల్ టీం ఉంటుందని, రోడ్డుపై, వలస వచ్చిన వారి పిల్లలకు చుక్కలు వేస్తారన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధానకూడళ్లలో పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రతి పీహెచ్సీ పరిధిలో బ్యానర్లు, టాం..టాం వేయించామని తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్‌వో జీవరాజ్, కొవిడ్ నివారణ డాక్టర్ అరవింద్, మెడికల్ హెల్త్‌కేర్ విమల, ఏఎస్వో నవీన్ పాల్గొన్నారు.
పల్స్‌పోలియోకు ఏర్పాట్లు పూర్తి
పల్స్‌పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో ఐదేండ్లలోపు చిన్నారులు 3,74,480 మంది ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 418, గ్రామీణ ప్రాంతాల్లో 1,133 కేంద్రాలతో కలిపి మొత్తం జిల్లాలో 1,551 పల్స్‌పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. 31న ఆదివారం 153 రూట్స్, 54 ట్రాన్సిట్ కేంద్రాలు, 207 మంది వైద్యాధికారులు, సూపర్వైజర్లు, 54 సంచార బృందాలతో కలిపి మొత్తం 5,342 సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటారు.
- డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
తాజావార్తలు
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- కొవాగ్జిన్ సామర్థ్యం.. 81%
- ‘రాసలీలల’ మంత్రి రాజీనామా
- ప్రభుత్వంతో విభేదించడం దేశద్రోహం కాదు
- 24/7 వ్యాక్సినేషన్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్
- సోషల్ మీడియా నియంత్రణపై రాష్ర్టాలకు అధికారం లేదు
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
- వెన్నునొప్పి ఉంది.. గుర్రం మీదొస్తా !
- జనాభాలో వాళ్ల వాటా 19.. సంక్షేమ పథకాల్లో 35 శాతం