శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Jan 30, 2021 , 00:27:23

వైకుంఠధామాలు పూర్తి చేయాలి

వైకుంఠధామాలు పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ పౌసుమిబసు 

వికారాబాద్‌, జనవరి 29 : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు ఫిబ్రవరి 10వతేదీలోగా పూర్తి చేయాలని సర్పంచులు, పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం వికారాబాద్‌ మండలం కామారెడ్డిగూడ, పాతూర్‌ గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో పురోగతి లేనందున సర్పంచులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయకుంటే పీఆర్‌ చట్టం  ప్రకారం చర్యలు తప్పవన్నారు. అన్ని సమస్యలను అధిగమించి సర్పంచ్‌లు పీఆర్‌ ఇంజినీరింగ్‌ అధికారులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రతి రోజూ చేపట్టిన పనుల వివరాలను తన వాట్సాప్‌కు పంపించాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట అధికారులు, సర్పంచ్‌లు ఉన్నారు. 

పిల్లలందరికీ పల్స్‌ పోలియో చుక్కలు వేయాలి

పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 0-5 సంవత్సరాల పిల్లలందరికీ పల్స్‌ పోలియో చుక్కలు వేయాలని కలెక్టర్‌ పౌసుమిబసు వైద్య అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ... పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు జిల్లాలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు పిల్లలందరికీ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ కోరారు.

VIDEOS

తాజావార్తలు


logo