బుధవారం 03 మార్చి 2021
Vikarabad - Jan 29, 2021 , 00:08:21

వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలి

వసతి గృహాల్లో  మౌలిక వసతులు కల్పించాలి

  •  అధికారుల సమావేశంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి జిల్లా అధికారి పుష్పలత 

వికారాబాద్‌, జనవరి 28, (నమస్తే తెలంగాణ): వసతి గృహం పరిసరాలు, వంటగది శుభ్రం చేసుకోవాలని వెనుకబడిన తరగతుల అభివృద్ధి జిల్లా అధికారి ఏ.పుష్పలత అన్నారు. గురువారం కొత్తగడి శివారులో ఉన్న బాలికల సమీకృత వసతి గృహంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వసతి గృహాలు పునఃప్రారంభం అవుతున్నందున శానిటైజ్‌ చేయించాలని, వసతి గృహం పరిసరాలతో పాటుగా వంటగది శుభ్ర పర్చాలన్నారు. నాణ్యమైన, శుభ్రమైన నిత్యావసర వస్తువులను ఉపయోగించాలని విద్యార్థులందరికీ తప్పనిసరిగా మినరల్‌ వాటర్‌ అందించాలని ఆదేశించారు. వసతి గృహంలో విద్యార్థులు కచ్చితంగా భౌతికదూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులందరికీ నోట్‌ పుస్తకాలు, దుప్పట్లు, బెడ్‌షీట్లు, శానిటైజర్లు, మాస్క్‌లు, సబ్బులు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. తప్పనిసరిగా మల్టీ విటమిన్‌ మాత్రలు అందుబాటులో పెట్టాలన్నారు. వైద్య సిబ్బంది ఫోన్‌ నంబర్లు హాస్టల్‌లో ఏర్పాటు చేయాలన్నారు.

VIDEOS

logo