బుధవారం 24 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 28, 2021 , 00:19:02

విమర్శలు తగవు

విమర్శలు తగవు

  • దౌల్తాబాద్‌ జడ్పీటీసీ 
  • కోట్ల మహిపాల్‌ముదిరాజ్‌ 

దౌల్తాబాద్‌, జనవరి 27 : అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేపై కాంగ్రెస్‌ పార్టీ నాయకుల విమర్శలు తగవని జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌ అన్నారు. బుధవారం ఆయన దౌల్తాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్లు ప్రజల్లో గుర్తింపు లేకపోవడంతో సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యే అభివృద్ధిపై విమర్శలు చేయడం రేవంత్‌రెడ్డి అనుచరులు  పనిగా పెట్టుకున్నారన్నారు. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి హయాం లో కొడంగల్‌లో జరిగిన అభివృద్ధి శూన్యమంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో ఈ నెల 29న కొడంగల్‌ అంబేద్కర్‌ చౌరస్తా సాక్షిగా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు దమ్ముంటే తమ నాయకుడితో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ నరోత్తంరెడ్డి, కృష్ణ, మాధవులు, నారాయణ, వెంకట్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo