శనివారం 06 మార్చి 2021
Vikarabad - Jan 28, 2021 , 00:19:02

పోలీసుల కళాజాత

పోలీసుల కళాజాత

బొంరాస్‌పేట, జనవరి 27 : మండలంలోని చౌదర్‌పల్లి గ్రామంలో బుధవారం పోలీసులు కళాజాత ప్రదర్శన నిర్వహించారు. మూఢ నమ్మకాలు, సాంఘిక దురాచారాలు, కరోనా జాగ్రత్తలు, రోడ్డు భద్రతా నియమాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు తదితర విషయాలపై కళాకారులు పాటల రూపంలో ప్రజలకు వివరించారు. తాగి వాహనాలు నడుపరాదని, ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నియమాలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, ఏఎస్‌ఐ సత్యశీలారెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.

చౌదర్‌పల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి రూ.10 వేల విరాళం ప్రకటించారు. ఆయనతో పాటు గ్రామస్తులు మరో రూ.20 వేల విరాళాలు అందించారు. నేరాల అదుపునకు, నేరస్తులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయని ఆయన అన్నారు. ఫిబ్రవరి 1 నాటికి గ్రామంలో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీతో ప్రారంభిస్తామని నారాయణరెడ్డి తెలిపారు. 


VIDEOS

logo