సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Jan 28, 2021 , 00:19:02

తాండూరు అభివృద్ధికి కృషి చేస్తా

 తాండూరు అభివృద్ధికి కృషి చేస్తా

  • రూ. 4.50 కోట్లతో పనులు పూర్తి 
  • మరో రూ.3.93లక్షల పనులకు టెండర్లు
  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న

తాండూరు, జనవరి 27: సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు మున్సిపల్‌ పాలకవర్గం, స్థానిక నేతలు, ప్రజలందరి సహకారంతో తాండూరు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న అన్నారు. బుధవారం చైర్‌పర్సన్‌గా ఎన్నికై ఏడాది కావడంతో పట్టణంలోని నేతలతో పాటు పాలకవర్గం ప్రత్యేక సంబురాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్‌పర్సన్‌ స్వప్న మాట్లాడుతూ తాండూరు మున్సిపల్‌లో 2014 నుంచి 2020 వరకు కాలనీల్లో రూ.4.50 కోట్ల నిధులతో ఉన్న 67 పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. 2020 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 36 పెండింగ్‌ పనులు రూ.2.53 కోట్లతో పూర్తికాగా, మరో రూ.1.97 కోట్లతో 31 పనులు ఇటీవల ప్రారంభించినట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం పట్టణ ప్రగతిలో భాగంగా తాండూరు మున్సిపల్‌కు ప్రతి నెల రూ.59 లక్షల నిధులు వస్తున్నాయని, దీంతో తాండూరు మున్సిపల్‌ పరిధిలోని 36 వార్డుల్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ.3 కోట్ల 93 లక్షలతో 128 పనులకు మున్సిపల్‌ పాలక వర్గం ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదం తెలిపిందన్నారు.  అందరి సహకారంతో తాండూరును ఆదర్శ మున్సిపల్‌గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌లీడర్‌ శోభారాణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

VIDEOS

logo