శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 28, 2021 , 00:19:04

గ్రామాలకు బీటీ రోడ్లు

గ్రామాలకు బీటీ రోడ్లు

  • తొలగనున్న ప్రయాణ ఇబ్బందులు 
  • రూ.6.14 కోట్ల వ్యయంతో నిర్మాణం 
  • 9కిలో మీటర్ల మేర కొనసాగుతున్న పనులు
  • శరవేగంగా కల్వర్టుల నిర్మాణాలు

పెద్దేముల్‌, జనవరి 27 : ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సును నడుపాలనే ఉద్దేశంతో అన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన మొదలుపెట్టి దశలవారీగా పూర్తి చేస్తున్నది. వేల కోట్ల రూపాయలతో అన్ని రకాల రోడ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. పెద్దేముల్‌ మండల పరిధిలోని పెద్దేముల్‌ మండల కేంద్రం నుంచి సిద్దన్నమదుగు తండా వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మిస్తున్నది. 

సుగమంకానున్న రోడ్డు మార్గం.. 

పెద్దేముల్‌ మండల కేంద్రం నుంచి సిద్దన్నమదుగు తండా వరకు సుమారు రూ.6 కోట్ల 14 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు పనులు తింసాన్‌పల్లి, గోపాల్‌పూర్‌, నాగులపల్లి గ్రామాల మీదుగా సుమారు 9 కిలోమీటర్ల మేర ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మొత్తం 15 కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా, అందులో ప్రస్తుతం 10 కల్వర్టుల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా 5 కల్వర్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కల్వర్టుల నిర్మాణ పనులు పూర్తికాగానే పూర్తిస్థాయిలో బీటీ రోడ్డు పనులు పూర్తి చేయనున్నారు. పెద్దేముల్‌ మండలం నుంచి తట్టేపల్లి, తొర్మామిడి, కోహిర్‌, జహీరాబాద్‌ ప్రాంతాలకు వెళ్లేవారు. ఇదే రోడ్డుమార్గంలో ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమై ముందస్తుగా కల్వర్టుల నిర్మాణ పనులు కొనసాగడంతో ప్రయాణికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

పది కల్వర్టుల నిర్మాణం పూర్తి

పెద్దేముల్‌ మండల కేంద్రం నుంచి సిద్దన్నమదుగు తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 15 కల్వర్టుల నిర్మాణంలో భాగంగా 10 కల్వర్టుల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా కల్వర్టుల నిర్మాణం పూర్తి కాగానే ప్రధాన బీటీ రోడ్డు నిర్మాణంలో భాగంగా సుమారు 9 కిలోమీటర్ల మేర వెట్‌మిక్స్‌(కంకర) పనులు వేగంగా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతాం. 

 - సిద్ధార్థ, పంచాయతీ రాజ్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, పెద్దేముల్‌ మండలం

VIDEOS

logo