తీరిన కల

- చిన్ననందిగామలో బీటీ రోడ్డు పనులు
- టీఆర్ఎస్ ప్రభుత్వంతో రోడ్లకు మహర్దశ
- అభివృద్ధిలో దూసుకెళ్తున్న గ్రామాలు, తండాలు
కొడంగల్, జనవరి 27 : అభివృద్ధి త్వరితగతిన సాధ్యపడేందుకు ప్రతి 500ల జనాభా ఉన్న గ్రామం, తండాలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో పల్లెలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయి. ఏండ్లకాలంగా సఫలీకృతం కాని అభివృద్ధి పనులు కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేస్తుండటంతో ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు రోడ్డు, తాగునీరు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడే గ్రామం అన్నింటా అభివృధ్ధిని సాధించే ఆస్కారం ఉంటుందని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా వరకు గ్రామాలకు రోడ్డు, తాగునీటి, రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండటం వల్ల గ్రామాల అభివృద్ధిలో వెనుబాటులో ఉండిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొడంగల్ మండల పరిధిలో కొండారెడ్డిపల్లి, లక్ష్మీపల్లి, బోయపల్లితండా, అన్నారం, పోచమ్మతండా, చిన్ననందిగామ తదితర గ్రామాలకు ఏండ్ల కాలంగా రోడ్డు సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు అన్ని కాలాల్లో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి గ్రామపంచాయతీకి రోడ్డు మంజూరు చేయడంతో రోడ్డు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులోభాగంగా అన్నారం, పోచమ్మతండా, కొండారెడ్డిపల్లి గ్రామాల్లో బీటీ రోడ్డు పనులు పూర్తి కావడంతో గ్రామ, తండాల వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చిన్ననందిగామ గ్రామపంచాయతీలో బుర్జునాన్పల్లి గ్రామం. ఈ రెండు గ్రామాల్లో సుమారు 1560 మంది జనాభా, 300 ఇండ్లు, 1140 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామం ఎన్‌హెచ్ 163 హైవేరోడ్డుకు కేవలం దాదాపు 2 కిలోమీటర్ల లోపు దూరం ఉంటుందని.. అయినప్పటికీ రోడ్డు సౌకర్యాలు లేక రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన వ్యయ ప్రయాసల నడుమ రోడ్డుకు చేరుకొని రవాణా సౌకర్యాలను పొందుతున్నట్లు తెలిపారు. గుంతలు, కంకరతో కూడుకున్న రోడ్డుతో అత్యవసర పరిస్థితుల్లో ఒక్కోసారి ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ తమ గ్రామ దుస్థితి మారలేదని, టీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అన్నింటా సౌకర్యాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దబడుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి రోడ్డు సౌకర్యాలు ప్రధానం కాబట్టి ఇటువంటి సౌకర్యాన్ని ఎమ్మెల్యేగా గెలిచిన రెండు సంవత్సరాల కాలంలోనే గ్రామ కలను తీర్చిన ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు.
బీటీ రోడ్డు ఏండ్ల నాటి కల : సావిత్రమ్మ, సర్పంచ్, చిన్ననందిగామ
బీటీ రోడ్డు కావాలనేది ఏండ్ల నాటి కల. కల కలగానే మిగులుతుందని అనుకున్నాం. గ్రామ కలను ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి రెండేండ్లలోనే తీర్చారు. గ్రామానికి సంవత్సరం క్రితం రూ.90లక్షలతో 2 కిలోమీటర్ల దూరం బీటీ రోడ్డు మంజూరైనా ఆయా కారణాలతో పనుల్లో జాప్యం ఏర్పంది. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతోపాటు చొరవ తీసుకొని గ్రామానికి బీటీ రోడ్డు పనులు పూర్తి చేయించారు.
రోడ్డు కలగా మిగులుతుందనుకున్నాం : వెంకటయ్య, బుర్జుగాన్పల్లి
ఏండ్ల నుంచి రోడ్డు కోసం అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందించడం, పనులు కాలేకపోవడంతో నిరాశకు గురికావడం చాలా బాధాకరంగా ఉండేది. రోడ్డు లేక అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలు కూడా గ్రామానికి వచ్చేవి కావు, అత్యవసర సందర్భంలో ఏం చేయాలో తోచని పరిస్థితి, నేడు గ్రామానికి రోడ్డు సౌకర్యాలు ఏర్పడటం చాలా సంతోషంగా ఉంది.
తాజావార్తలు
- స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి
- త్వరలో మేడిన్ ఇండియా ఐఫోన్ 12
- పుంజుకున్న కార్లు, ట్రాక్టర్ల సేల్స్.. త్రీ వీలర్స్ 50 శాతం డౌన్!
- ‘జాతి రత్నాలు’ బిజినెస్ అదుర్స్.. అంచనాలు పెంచేస్తున్న సినిమా
- పీఎంఏవై-యూ కింద కోటి 11 లక్షల ఇళ్లు మంజూరు
- ఆశాజనకంగా ఆటో సేల్స్ : ఫిబ్రవరిలో 10.59 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
- పుదుచ్చేరి ఎన్నికలు.. ఎన్డీఏ కూటమిలో ఎవరెవరికి ఎన్ని సీట్లంటే.!
- సచిన్ వాజేను అరెస్టు చేయండి.. అసెంబ్లీలో ఫడ్నవీస్ డిమాండ్
- ఎమ్మెల్యే అభ్యర్థిగా అసోం సీఎం నామినేషన్ దాఖలు
- ఆదా చేయండి.. సీదా వెళ్లండి