ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Jan 27, 2021 , 00:10:47

హెల్మెట్‌ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి

హెల్మెట్‌ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి

కొడంగల్‌, జనవరి 26 : హెల్మెట్‌ ధరించని కారణంగా ప్రాణాలను కోల్పోవాల్సి వస్తున్నదని మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వడ్డర్‌గల్లి యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చైర్మన్‌ ద్విచక్రవాహనదారులకు అంబేద్కర్‌ కూడలిలో ఉచితంగా హెల్మెట్‌లను పంపిణీ చేశారు. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ అత్యవసర పని ఉన్నా లేకున్నప్పటికీ నేటి యువత జోష్‌తో మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ప్రమాదాలను కొనితెచ్చుకొంటున్నారని, వేగం కన్నా ప్రాణాలు ముఖ్యం అని గమనించాలని తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ హెల్మెట్‌లను అందించగా అభినందించారు. అనంతరం హెల్మెట్‌పై అవగాహన కల్పించేందుకు పట్టణంలో హెల్మెట్లు ధరించి ర్యాలీ నిర్వహించారు. 

VIDEOS

logo