చదువుతో పాటు సామాజిక సేవ అవసరం

- విద్యాశాఖమంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి
- కోట్మర్పల్లిలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశాలకు హాజరు
వికారాబాద్, మర్పల్లి,జనవరి 25: యువత సామాజిక సేవలతో పాటు చదువులో ముం దుండాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మర్పల్లి మండల పరిధిలోని కోట్మర్పల్లిలో నేతాజీ 124వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్న మెంట్ ముగింపు సమావేశాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామం లోని నేతాజీ సుభాష్‌చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనం తరం గ్రామంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కోట్‌మర్పల్లి యువత నేతాజీ స్ఫూర్తితో ముందుకు సాగడం చాలా సంతోషక రమన్నారు. యువత సామాజిక సేవతో పాటు చదువులో కూడా ముందుండాలని తెలిపారు. దేశం కోసం పనిచేసిన వారిని గుర్తించి వారిని సన్మానించడం గొప్ప విషయమని కొని యాడారు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేతాజీ అడుగుజాడల్లో నడుచుకోవాలన్నారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని గ్రామంలో 14 రోజుల పాటు 40 టీంలతో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం, స్థానిక సర్పంచ్ విజయలక్ష్మి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభా కర్గుప్తా, రైతు బంధు అధ్యక్షుడు నాయబ్‌గౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు సోహైల్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మధుకర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యువజన సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకు లు రాచయ్య, వికారా బాద్ టీఆర్ఎస్ నాయకులు సుభాన్‌రెడ్డి, లక్ష్మణ్, షఫీ, పాల్గొన్నారు. అనంతరం క్రికెట్ టోర్నమెంటులో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన టీంలకు బహుమ తులను ప్రదానం చేశారు. వారితో పాటు దేశం కోసం సేవ చేసిన రిటైర్డు సర్వీసు మెన్లను సన్మానించారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి, ఎంపీ
శంకర్పల్లి, జనవరి 25 : శంకర్పల్లి మాజీ సర్పంచ్ సాత ఆత్మలింగం సతీమణి అరుణాదేవి అకాల మృతి చెందడంతో సోమవారం ఉదయం మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యఆత్మలింగం స్వగృహానికి వచ్చి పరామర్శించారు. అరుణా దేవి భౌతిక కాయంపై పుష్ప గుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు.
తాజావార్తలు
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి