ప్రతిఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి

- జాతీయ ఓటరు దినోత్సవాన్ని ప్రారంభించిన కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్, జనవరి 25 : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో 11వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం వంటిదన్నారు. మంచి నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మహవీర్ దవాఖానలో కొవిడ్ వ్యాక్సినేషన్ పరిశీలన
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా వ్యాక్సినేషన్ వేయాలని కలెక్టర్ పౌసుమి బసు డాక్టర్లకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మహవీర్, సాయి డెంటల్ కళాశాలల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ వ్యాక్సినేషన్ వేయాలని సూచించారు. మహావీర్ దవాఖానలో 200 మందికి వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్లు తెలిపారు. మహవీర్తోపాటు, సాయి డెంటల్ దవాఖాన, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ ప్రభుత్వ దవాఖానల్లో వ్యాక్సినేషన్ చేసినట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు దిలీప్, చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.