సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Jan 25, 2021 , 00:23:03

డివైడర్‌ను ఢీకొన్న కారు ఒకరు మృతి

డివైడర్‌ను ఢీకొన్న కారు ఒకరు మృతి

  • ఇద్దరికి తీవ్ర గాయాలు

బొంరాస్‌పేట, జనవరి 24 : హైదరాబాద్‌-బీజాపూర్‌ 163వ నెంబరు జాతీయ రహదారిపై మండలంలోని భోజన్నగడ్డతండా శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ శ్రీశైలం కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన సిరిగిరి అంజప్ప(32) ఎల్‌ఈడీ బల్బులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ నుంచి బయలుదేరి మండలంలోని తుంకిమెట్ల అంగడిలో బల్బులు అమ్ముకుని తన మారుతీ ఒమ్నీ వాహనంలో మధ్యాహ్నం వికారాబాద్‌కు బయలుదేరాడు. భోజన్నగడ్డతండా స్టేజీ మలుపులో వాహనం అతి వేగంగా కల్వర్టు డివైడర్‌ను ఢీకొట్టడంతో అంజప్ప, వాహనంలో ఉన్న అతడి కొడుకు వివేక్‌, అన్న కూతురు మనీషాలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే పరిగి దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ అంజప్ప మృతిచెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ఎస్‌ఐ శ్రీశైలం తెలిపాడు. ఒమ్నీ వాహనం కల్వర్టు గోడను ఎక్కడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

VIDEOS

logo