శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 25, 2021 , 00:22:41

బాలికలపై వివక్షత పోవాలి

బాలికలపై వివక్షత పోవాలి

జాతీయ బాలికల దినోత్సవంలో ఎంపీపీ చంద్రకళ

వికారాబాద్‌, జనవరి 24 : బాలికలు అన్ని రంగాల్లో నైపుణ్యతను ప్రదర్శించినప్పటికీ ఇంకా వివక్షత కొనసాగుతున్నదని వికారాబాద్‌ ఎంపీపీ మామిడి చంద్రకళ అన్నారు. ఆదివారం వికారాబాద్‌ మండలం పులుమద్ది గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. చైల్డ్‌లైన్‌ ఇచ్చిన రికార్డు ప్రకారం దాదాపు 140 పైనే బాల్య వివాహాలు నమోదయ్యాయని చెప్పారు. సర్పంచ్‌ మాధవరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో బాల్యవివాహాలు జరుగకుండా రెండేండ్లుగా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. 

ఆడపిల్లల ఎదుగుదలకు తోడ్పడుదాం

కొడంగల్‌, జనవరి 24 : ఆడపిల్లల ఎదుగుదలకు తోడ్పాటును అందిద్దామని ఇన్‌స్పెక్టర్‌ పోస్ట్‌ పాలమూరు వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ అధికారి వీరారెడ్డి పేర్కొన్నారు. స్థానిక పోస్టాఫీసు సిబ్బంది సుకన్య పొదుపు పథకంపై పట్టణంలో ఇంటింటికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 10 సంవత్సరాలలోపు బాలికలకు ఈ పథకం వర్తిస్తుందని, 15 సంవత్సరాల తరువాత స్కీం మెచ్యూరై వారి చదువులు లేక వివాహాలకు తోడ్పడే గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. వెస్ట్‌ పరిధిలో 450 ఖాతాలున్నాయని, అందరికి ఈ పథకం అందించాలనే ఉద్దేశంతో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.  


VIDEOS

logo