మంగళవారం 09 మార్చి 2021
Vikarabad - Jan 24, 2021 , 00:32:04

కొవిడ్‌ నిబంధనలతోనే బడుల పునఃప్రారంభం

కొవిడ్‌ నిబంధనలతోనే బడుల పునఃప్రారంభం

  • జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి

వికారాబాద్‌, జనవరి 23 : కొవిడ్‌ నిబంధనలతోనే బడులను ప్రారంభిస్తున్నట్లు జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రతి తరగతి గదిని శానిటేషన్‌ చేయాలని అధికారులకు అదేశించారు. శనివారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో చైర్‌ పర్సన్‌ అధ్యక్షతన స్థాయీ సంఘాల సమావేశాల్లో వివిధ శాఖలపై చర్చించారు. పాఠశాలలు ప్రారంభం కానున్నందున విద్యా, ఆరోగ్యశాఖ అధికారులు  జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రతి మండలానికి రూ.10 లక్షల నిధులు పాఠశాలల మరమ్మతులకు కేటాయించామన్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన రూ.1.15 కోట్ల నిధులతో పారుశుధ్యం, తాగునీటికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.   పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి ఏర్పాటు, మరుగుదొడ్లు నిర్మాణం, పారుశుధ్యం పనులకు ఆర్థిక సంఘం నిధులు వినియోగిస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవలు మెరుగుపర్చుకోవాలని అధికారులకు సూచించారు. అమ్మఒడి పథకంలో మహిళలు గర్భం దాల్చిన 54 రోజుల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, సీఈవో ఉషా, జడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


VIDEOS

తాజావార్తలు


logo