శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Jan 23, 2021 , 00:15:04

అడవిలో బుల్లెట్‌ అబీబ్‌ఖాన్‌దే..!

అడవిలో బుల్లెట్‌ అబీబ్‌ఖాన్‌దే..!

  •  ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు

తాండూరు, జనవరి 22: వికారాబాద్‌ జిల్లా యాలాల మం డలం అడాల్‌పూర్‌ అటవీ ప్రాం తంలో ఇటీవల ఓ పశువుల కాపరికి దొరి కిన తుపాకీ బుల్లెట్‌తో పాటు మ్యాగ్జిన్‌ రేపిన కలకలంను తాండూరు పోలీసులు ఛేదించారు. శుక్రవారం తాం డూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ రవికుమార్‌ మాట్లా డుతూ అటవీ ప్రాంతంలో దొరికిన రైఫిల్‌ బుల్లెట్‌పై పూర్తి విచారణ చేపట్టినట్లు తెలిపారు. తాండూరులో 54 మంది దగ్గర ఉన్న లెసెన్స్‌ తుపాకీలను పరిశీలించమన్నారు. అందులో తాండూరు పట్టణానికి చెందిన అబీబ్‌ఖాన్‌ దగ్గర ఉన్న రైఫిల్‌కు మ్యాగ్జిన్‌తో పాటు బుల్లెట్‌ లేనట్లు గుర్తించినట్టు  తెలిపారు. 

అటవీ ప్రాంతంలో లభించిన బుల్లెట్‌, మ్యాగ్జిన్‌ అబీబ్‌ఖాన్‌ రైఫిల్‌కు దగ్గర సంబంధం ఉన్నట్లు ప్రాథమిక పరిశీలనలో తేలిందన్నారు. దీంతో అబీబ్‌ఖాన్‌పై నెగ్లిజెన్సీ యాక్టు-30పై కేసు నమోదు చేసి ఆయన దగ్గర ఉన్న రైఫిల్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌ పరిశీలన కోసం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఫోరెన్సిక్‌  ల్యాబ్‌ నివేదిక అనంతరం ఈ కేసుపై పూర్తి సమాచారం తెలుస్తుందన్నారు. అయితే అబీబ్‌ఖాన్‌ అటవీప్రాంతానికి ఎప్పుడు వెళ్లాడు..? ఎందుకు వెళ్లాడు..? అనేది స్పష్టంగా తెలియాల్సి ఉందన్నారు.  

VIDEOS

logo