మ్యుటేషన్ నో టెన్షర్

- కలెక్టర్ ఆధ్వర్యంలో ధరణి ద్వారా పరిష్కారం
- దరఖాస్తులను పరిశీలిస్తున్న తాసిల్దార్లు
- వికారాబాద్ జిల్లాలో 700పైగా పైళ్లు పెండింగ్
గతంలో కొనుగోలు చేసిన భూములకు రిజిస్ట్రేషన్ పూర్తయినా మ్యుటేషన్లు(భూమి కొన్నవారి పేరు మీద రికార్డుల్లో మార్చడం) కాలేదు. దీంతో పట్టాదారు పాస్‌బుక్‌లు కూడా అందకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనున్నది. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లను క్లియర్ చేసేందుకు సర్కార్ అనుమతిచ్చింది. కలెక్టర్ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్ ద్వారా మ్యుటేషన్ పక్రియను చేపట్టాలని ఆదేశాలివ్వగా అధికారులు అందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా వికారాబాద్ జిల్లాలోని రెండు డివిజన్ల పరిధిలో 700 పైగా మ్యుటేషన్ పైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు సాదా బైనామా దరఖాస్తులను కూడా పరిష్కరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
వికారాబాద్, జనవరి 20, (నమస్తే తెలంగాణ): జిల్లాలో మ్యుటేషన్ సమస్యలకు లైన్‌క్లియర్ కానున్నది. గతంలో భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు అయినా మ్యుటేషన్ కాని వాటిని క్లియర్ చేసేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని పరిష్కరించే దిశగా అడుగులు మొదలయ్యాయి. అన్ని అర్హతలు ఉన్న భూములను మ్యుటేషన్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ రావడంతో అధికారులు ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. ధరణి ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు సన్నద్ధం అవుతున్నారు. వివిధ మండలాల్లో పెండింగ్‌లో ఉన్నవాటిని అధికారులు గుర్తిస్తున్నారు. వీటితో పాటు సాదా బైనామాలను కూడా చేసేందుకు సిద్ధమవుతున్నారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. కాగితంపై రాతతో భూ ఒప్పందాలకు ఫుల్స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. మొదటగా 2016లో 5,186 దరఖాస్తులు వచ్చాయి. రైతుల వినతి మేరకు మరో చాన్స్ ఇచ్చింది.
జిల్లాలో 3,851 దరఖాస్తులు
వికారాబాద్ జిల్లాలో 3,851 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా కుల్కచర్ల మండలం నుంచి 444 వచ్చాయి. ధరణి పోర్టల్ ద్వారా ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారి భూములు మ్యుటేషన్ చేయలేదు. ధరణికి ముందు చేసుకున్న వారివి కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ధరణి ద్వారా భూముల రిజిస్ట్రేషన్ చేసుకున్న పాత వాటికి మ్యుటేషన్ చేసేందుకు అనుమతులు ఇవ్వలేదు. ఆ సమయంలో భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. తాసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో గతంలో రిజిస్ట్రేషన్ అయిన భూములను మ్యుటేషన్ చేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లాలోని వికారాబాద్, తాండూరు డివిజన్లలో 18 మండలాల్లో 966 ఉండగా.. 200 మ్యుటేషన్లు పూర్తి చేశారు. ఇంకా 700లకు పైగా ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలోని 18 మండలాల్లో ధరణిలో 4395 స్లాట్ బుకింగ్ చేసుకోగా.. బుధవారం వరకు 4168 డాక్యుమెంట్లు ధరణిలో రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇంకా 227 స్లాట్ బుకింగ్ పెండింగ్‌లో ఉన్నాయి.
అర్హతలున్నా .. లేకున్నా.. కలెక్టర్ వద్దకే..
మ్యుటేషన్ చేయడానికి ప్రభుత్వం కలెక్టర్‌కు అనుమతులిచ్చింది. వారి ఆదేశాల మేరకు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ తాసిల్ కార్యాలయాల్లో పెండింగ్ ఉన్న మ్యుటేషన్ల పూర్తి చేసేందుకు కలెక్టర్ సన్నద్ధమయ్యారు. ఆయా తాసిల్ధార్ల పరిధిలో గతంలో మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించి పంపించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను తాసిల్దార్లు పరిశీలన జరుపుతున్నారు. సంబంధిత వారికి గతంలో నోటీసులు ఇచ్చారు. వాటిని పరిశీలించడంతో పాటు అనుకూలమైన వాటిని కలెక్టర్‌కు పంపించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. మ్యుటేషన్‌కు అర్హతలు ఉన్న వాటిని పంపించడంతో పాటు అర్హతలు లేని వాటికి సంబంధించి వివరాలను కూడా పంపించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వీటిని కలెక్టర్ పరిశీలించిన తర్వాత అనుకూలమైన వారికి బయోమెట్రిక్ ద్వారా అనుమతులు ఇవ్వనున్నారు. కలెక్టర్ అనుమతితో సంబంధింత భూ యాజమానులు ధరణిలో మ్యుటేషన్ కోసం మీ- సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోగానే రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి.
కొన్న వారి పేరు మీద రికార్డుల్లోకి..
వివిధ తాసిల్దార్ కార్యాలయాల్లో కొన్ని నెలలుగా జిల్లాలో 700 మ్యుటేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. భూములు కొనుగోలు చేసినా.. కొన్న వారి పేరు మీద రికార్డుల్లోకి ఎక్కించకపోవడంతో.. కొద్దిరోజులుగా అమ్మిన వారి పేరు మీదనే భూములు నమోదై ఉండడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా అమ్మిన వారి పేరు మీద ఉండడంతో కొనుగోలు చేసిన వారు ఆందోళన ఉన్నారు. ప్రస్తుతం సర్కార్ నుంచి ఆదేశాలు రావడంతో కొనుగోలు చేసిన వారి పేరు మీద రెవెన్యూ రికార్డులు నమోదు కానున్నాయి.
పెండింగ్‌లో 700 మ్యుటేషన్లు
జిల్లాలో పెండింగ్‌లో 700 మ్యుటేషన్ ఉన్నాయి. వీటిన్నింటిన్ని త్వరలో క్లియర్ చేస్తాం. పెండింగ్ మ్యుటేషన్ భూ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అర్హతలు ఉన్న భూములను మ్యూటేషన్ చేయడనికి శ్రీకారం చుట్టాం. గతంలో భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు జరిగి మ్యుటేషన్లు కాని భూములకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.
- మోతీలాల్, అదనపు కలెక్టర్, వికారాబాద్
తాజావార్తలు
- రేడియోలాజికల్ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ డిప్లొమా
- ఎంపీ కొడుకుపై కాల్పులు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి
- కళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలి