శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Jan 22, 2021 , 00:15:55

రోడ్డు భద్రత అందరి బాధ్యత

రోడ్డు భద్రత అందరి బాధ్యత

  • మోమిన్‌పేట సీఐ వెంకటేశం
  • కొనసాగుతున్న రోడ్డు భద్రత వారోత్సవాలు

ధారూరు/కోట్‌పల్లి, జనవరి 21: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని సీఐ వెంకటేశం పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం మోమిన్‌పేటలో వాహనదారులకు పుష్పాలు అందించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. బైక్‌ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. మద్యం తాగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడుపరాదని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ అనిత, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం

నిబంధనలు పాటించి వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని ధారూరు ఎస్‌ఐ సురేశ్‌ అన్నారు. ధారూరు బస్టాండ్‌ వద్ద వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫోర్‌వీలర్‌ వాహనదారులు సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలన్నారు. అందరి వద్ద డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు సంబంధిత ధ్రువ పత్రాలు ఉండాలని తెలిపారు. ఏకాగ్రతతో వాహనాలు నడుపాలన్నారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుపోవద్దన్నారు.  కార్యక్రమంలో ధారూరు ఎస్‌ఐ-2 మల్లయ్య, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. కోట్‌పల్లిలో వాహనదారులకు ఏఎస్సై నాగేందర్‌ అవగాహన కల్పించారు. 

VIDEOS

logo