మంగళవారం 02 మార్చి 2021
Vikarabad - Jan 22, 2021 , 00:16:01

కొత్తరకం మొక్కలు పెంచాలి

కొత్తరకం మొక్కలు పెంచాలి

  • వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌, జనవరి 21: హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2021 సంవత్సరంలో మొక్కలు నాటేందుకు లక్ష్యాల మేరకు అన్ని గ్రామపంచాయతీల్లోని నర్సరీల్లో నాణ్యమైన కొత్త రకం మొక్కలు పెంచాలని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, నాణ్యమైన విత్తనాలు ప్లాస్టిక్‌ బ్యాగుల్లో  వెంటనే నాటాలని సూచించారు. నిర్దేశించిన మేరకు మొక్కలను సంరక్షించాలన్నారు. డంపింగ్‌యార్డుల వద్ద ఫెన్సింగ్‌ కోసం గచ్చకాయ మొక్కలను నర్సరీల్లో పెంచాలని తెలిపారు. పట్టణాల సుందరీకరణకు వికారాబాద్‌, తాండూరు పట్టణాల్లోని ప్రధానకూడళ్ల వద్ద బ్యూటిఫికేషన్‌ పనులు చేపట్టాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, డీఎఫ్‌వో వేణుమాధవ్‌రావు, తాండూరు ఆర్డీవో అశోక్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. 

VIDEOS

logo