శనివారం 06 మార్చి 2021
Vikarabad - Jan 21, 2021 , 00:27:54

రూ.కోటి 43లక్షలతో అభివృద్ధి పనులు

 రూ.కోటి 43లక్షలతో అభివృద్ధి పనులు

  • ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి 
  • సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు ప్రారంభం

పరిగి, జనవరి 20 : పరిగి మున్సిపల్‌ పరిధిలో మున్సిపాలిటీ నిధులు రూ.కోటి 43లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని బహార్‌పేట్‌లో రూ.10లక్షలతో నిర్మాణం పూర్తి చేసిన సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వార్డులలో ఆయా ప్రాంతాలలో గల సమస్యలకు సంబంధించి, ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీల పనులు కొనసాగుతున్నాయన్నారు. తద్వారా రాబోయే నాలుగేండ్లలో అన్ని వార్డులను అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధికి అన్ని వర్గాల వారు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, సంతోష్‌కుమార్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌, నార్మాక్స్‌ డైరెక్టర్‌ వెంకట్‌రాంరెడ్డి ఉన్నారు.

ఆలయాల పునర్నిర్మాణం త్వరగా జరిగేలా చూడాలి 

పరిగిలోని మైసమ్మ, పోచమ్మ ఆలయాల పునర్నిర్మాణం త్వరగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల నిర్మాణ విషయంలో అవసరమైన ప్రత్యేక చొరవ తీసుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌కు సూచించారు. నిధుల మంజూరుకు సహకారం అందజేస్తానని చెప్పారు. 


VIDEOS

logo