గురువారం 25 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 21, 2021 , 00:27:54

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

  • పటాకులు కాల్చి కేక్‌కట్‌ చేసి నాయకుల సంబురాలు

బొంరాస్‌పేట, జనవరి 20 : కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం మండలంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. భూలక్ష్మి ఆలయం చౌరస్తాలో పటాకులు కాల్చి, అనంతరం కార్యకర్తలు, నాయకులు కేక్‌కట్‌ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కోస్గి పట్టణంలో నిర్వహించిన రక్తదానం శిబిరంలో మండలానికి చెందిన దేశ్యానాయక్‌, సలాం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో పీఏసీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, ఎంపీపీ హేమీబాయి, వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చాంద్‌పాషా, పార్టీ ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, తాలుకా, మండల యూత్‌ అధ్యక్షుడు నరేశ్‌గౌడ్‌, మహేందర్‌, పార్టీ నాయకులు టీటీ రాములు, రామకృష్ణయాదవ్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో..

కొడంగల్‌, జనవరి 20 : ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు 

తెలిపారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన ప్రత్యేక సంచికను ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు.  కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు కటకం శివకుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఉషారాణి, కౌన్సిలర్లు మధుసూదన్‌యాదవ్‌, వెంకట్‌రెడ్డి, రమేశ్‌, రహత్‌బేగం, మండల కోఆప్షన్‌ సభ్యుడు ముక్తార్‌, సర్పంచ్‌లు సయ్యద్‌ అంజద్‌, పకీరప్ప, మాజీ సర్పంచ్‌ రమేశ్‌బాబు, సిద్దిలింగప్ప పాల్గొన్నారు. 

దౌల్తాబాద్‌ మండలంలో..

దౌల్తాబాద్‌, జనవరి 20 : ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను దౌల్తాబాద్‌ మండలంలో టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు ప్రమోద్‌రావు, మాజీ జెడ్పీటీసీ మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ కోట్ల మహిపాల్‌, ఎంపీపీ విజయ్‌కుమార్‌, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్లతో పాటు పలువురు నాయకుల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మంచి మనసున్న నేత పట్నం నరేందర్‌రెడ్డి అని గుర్తు చేశారు. ప్రజాసేవలో ఆయన దిట్ట అన్నారు.  కార్యక్రమంలో భగవంతు, మల్లేశం, మంజూలాల్‌ నాయక్‌, పాండునాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సర్పంచులు, ఎంపీపీటీసీలు  పాల్గొన్నారు.

VIDEOS

logo