శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 21, 2021 , 00:27:52

అన్నదాతల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్‌

అన్నదాతల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్‌

  • రికార్డు స్థాయిలో రైతు వేదికల నిర్మాణం 
  • నవాబుపేట మండలంలో పలు భవనాలు ప్రారంభం
  • హాజరైన జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి
  • రికార్డు స్థాయిలో రైతు వేదికల నిర్మాణం
  • రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి  సబితాఇంద్రారెడ్డి,  జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతారెడ్డి 

వికారాబాద్‌, జనవరి 20: అన్నం పెట్టే రైతన్నకు కన్నీరు రాకుండా  ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూసుకుంటున్నారని  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  సబితారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ పి.సునీతారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని నవాబుపేట మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామంలో రూ.11 లక్షలతో రైతు వేదిక, మండల కేంద్రంలో రూ.11లక్షలతో రైతు వేదిక, రూ.10లక్షలతో నిర్మించిన  గ్రంథాలయం, రూ.38 లక్షలతో స్త్రీశక్తి భవనం, రూ.20లక్షలతో ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను మంత్రి, జడ్పీ చైర్‌పర్సన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు చర్చించుకోవడానికి , సలహాలు, సూచనలు పొందడానికి 2604 రైతు వేదికలు నిర్మించినట్టు తెలిపారు.  ప్రతి సంవత్సరం రాష్ట్రంలో రైతులకు రైతుబంధు కింద రూ.7500 కోట్లు  పంపిణీ చేస్తున్నామని వారు గుర్తు చేశారు.  అనంతరం మండల కేంద్రంలో మండలానికి సంబంధించి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.  కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ భవాని, జడ్పీటీసీ జయమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ పోలీస్‌ రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, సీనియర్‌ నాయకుడు చిట్టెపు మల్లారెడ్డి, ఎల్లకొండగ్రామ సర్పంచ్‌ రావుగారి వెంకట్‌రెడ్డి, నవాబుపేట సర్పంచ్‌ విజయలక్ష్మి, నాయకులు ఏసుదాసు, రత్నం, ప్రకాశం, ప్రభాకర్‌, శాంతకుమార్‌, తాసిల్దార్‌ బుచ్చయ్య, పీఆర్‌ ఏఈ లక్ష్మయ్య, డిప్యూటీ తాసిల్దార్‌ కృష్ణ, హెచ్‌ఎం పాండు, ఎంపీడీవో, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  

ఎల్లకొండ పార్వతీ పరమేశ్వరుల ఆలయంలో పూజలు

నవాబుపేట మండల పరిధిలోని ఎల్లకొండ (వెండికొండ) పార్వతీ పరమేశ్వరుల ఆలయాన్ని  మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య  దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని అర్చకులు అర్చక, అభిషేకం అందించారు. ఆలయ చరిత్రను అర్చకులు మంత్రికి వివరించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామ సర్పంచ్‌ రావుగారి వెంకట్‌రెడ్డి మంత్రి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌లను కోరారు. 


VIDEOS

logo