మంగళవారం 02 మార్చి 2021
Vikarabad - Jan 21, 2021 , 00:28:05

ఆలు రైతులకు భలే చాన్స్‌

ఆలు రైతులకు భలే చాన్స్‌

  • రెండు రోజుల్లో నిర్ణయం
  • లాభంలో 50 శాతం రైతులకే ఇస్తాం
  • కలెక్టర్‌ పౌసుమిబసు 
  • హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌ ధరకే అనంతగిరి కేంద్రంలో కొనుగోలు

మోమిన్‌పేట జనవరి 20: మండలంలో ఆలుగడ్డ పండించిన రైతులకు అనంతగిరి రైతు కూరగాయల ఉత్పత్తి కేంద్రం సువర్ణావకాశం అందిస్తుందని కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. మండల కేంద్రంలో అనంతగిరి కూరగాయల కేంద్రం సిబ్బందితో బుధవారం ఆలుగడ్డ కోనుగోలుపై సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్‌  మాట్లాడుతూ మండల కేం ద్రంలోని అనంతగిరి రైతు కూరగాయల ఉత్పతి కేంద్రంలో ఆలుగడ్డ కొనుగోలు జరుగుతుందని తెలిపారు. మండల పరిధిలోని గ్రామాల్లో ఆలుగడ్డ పండించిన రైతులు అనంతగిరి కేంద్రంలో అమ్ముకోవాలని సూచించారు. రైతులు కోరిన విధంగా బోయిన్‌పల్లి మార్కెట్‌లో ఆలుగడ్డ ధరకే ఇక్కడ కొనుగోలు చేస్తారని, రెండు రోజుల్లో అలుగడ్డ ధర నిర్ణయించి ప్రకటిస్తామని తెలిపారు. బయటి మార్కెట్‌ల్లో ఆలుగడ్డ ధర ఎక్కు వ తక్కువ అయినా  రైతులకు నష్టం కలుగకుండా మొదట నిర్ణయించిన ధరకే రైతుల నుంచి కొనుగోలు చేస్తామని అన్నారు. ఆలుగడ్డ వ్యాపారంలో అనంతగిరి కేంద్రానికి వచ్చి న లాభాల్లో 50 శాతం లాభాన్ని ఈ కేంద్రంలో ఆలుగడ్డ అమ్ముకున్న రైతులకే అందిస్తామని ఆమె తెలిపారు.అదే విధం గా మండల పరిధిలోని గ్రామల్లో మామిడి తోటలను అనంతగిరి రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా కౌలుకు తీసుకుంటామని, ఆ రైతులకు కూడా మంచి లాభాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీపీఎం శ్రీనివాస్‌, ఏపీఎం శివ, అనంతగిరి కేంద్రం సిబ్బంది  పాల్గొన్నారు.

VIDEOS

logo