సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Jan 19, 2021 , 00:04:52

ఏకాగ్రతతో డ్రైవింగ్‌ చేయాలి

ఏకాగ్రతతో డ్రైవింగ్‌ చేయాలి

  • వాహనదారులు సేఫ్టీ రూల్స్‌ 
  • పాటించాలి : కలెక్టర్‌ పౌసుమి బసు
  • కలెక్టర్‌ కార్యాలయంలో వారోత్సవాలు ప్రారంభం

 వికారాబాద్‌, జనవరి 18: వాహనదారులు తప్పకుండా సేఫ్టీ రూల్స్‌ పాటిస్తూ ప్రమాదాలకు గురికాకుండా వాహనాలను జాగ్రత్తగా నడుపాలని కలెక్టర్‌ పౌసుమి బసు సూచించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో 32వ జాతీయ రహదారి భద్రతావారోత్సవాలు 2021 రవాణాశాఖ ముద్రించిన కరపత్రాలు, బ్యానర్‌లను ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు భద్రత ప్రచార వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రాణం ఎంతో విలువైందని, వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా సేఫ్టీ రూల్స్‌ పాటి స్తూ వాహనాలను వేగంగా నడుపకూడదని సూచించారు. వాహనదారులు తప్పకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలన్నారు. దీంతోపా టు వాహనాలు నడిపే సమయంలో ఖచ్చితంగా సీట్‌ బెల్టు, హెల్మెట్‌ పెట్టుకోవాలన్నారు. ఈ నెల 18నుంచి ఫిబ్రవరి 17వరకు నెల రోజుల పాటు జిల్లాలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించి, రోడ్డు భద్రతపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. వికారాబాద్‌ను ప్రమాదరహిత జిల్లాగా మార్చుకునేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి భద్రునాయక్‌, పరిగి ఎంవీఐ జోసెఫ్‌, ఆర్టీసీ డీఎం హరి, ఆర్‌అండ్‌బీ డీఈ శ్రీధర్‌తోపాటు డ్రైవర్లు పాల్గొన్నారు. 

మద్యం సేవించి వాహనాలు నడుపొద్దు.. 

మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని జిల్లా రవాణాశాఖ అధికారి భద్రునాయక్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపకూడదన్నారు. వాహనదారులు ఏకాగ్రతతో నడుపాలని తెలిపారు. డ్రైవర్లు సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడుపరాదన్నారు. చిన్న చిన్న విషయాలకులోనై కుటుంబాలకు శాశ్వతంగా దూరం కావొద్దని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్‌ హరి, సిబ్బంది పాల్గొన్నారు.

VIDEOS

తాజావార్తలు


logo