పొలానికి కాపలాగా వెళ్లిన వృద్ధుడి దారుణ హత్య

బొంరాస్‌పేట, జనవరి 17 : వ్యవసాయ పొలానికి కాపలాగా వెళ్లిన వృద్ధుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం మండలంలోని సాలిండాపూర్ గ్రామంలో వెలుగుచూసింది. ఎస్ఐ శ్రీశైలం కథనం ప్రకారం.. సాలిండాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యగౌడ్ గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో వరినారు పోశాడు. బోరు నుంచి పొలానికి నీటిని అందించడానికి ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పైపులను(వంకిలు) రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకునిపోయారు. దీంతో పొలం యజమాని యాదయ్యగౌడ్ అదే గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల ఎల్లప్ప((65)ను పొలం వద్ద ఈ నెల 15న కాపలాగా ఉంచాడు. శనివారం రాత్రి కూడా ఎల్లప్ప పొలానికి కాపలా వెళ్లాడు. యాదయ్యగౌడ్ కొడుకు సంపత్‌గౌడ్ ఎప్పటిమాదిరిగా ఆదివారం ఉదయం పొలానికి వెళ్లగా ప్లాస్టిక్ పైపులు మళ్లీ అపహరణకు గురైనట్లు గుర్తించాడు. మనిషిని కాపలాగా ఉంచినా పైపులు ఎలా ఎత్తుకెళ్లారని ఎల్లప్పను అడుగుదామని అక్కడే ఉన్న గుడిసె వద్దకు వెళ్లగా ఎల్లప్ప గొంతుపై గాయాలతో మృతిచెంది ఉన్నాడు. గొంతులో, దవడ కింద చాకు లేదా పదునైన కట్టెతో పొడవడం వల్లే మృతిచెందాడని అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న కొడంగల్ సీఐ నాగేశ్వర్రావు, ఎస్ఐ శ్రీశైలం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్కాడ్, క్లూస్ టీంను రప్పించారు. సంపత్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని సీఐ తెలిపారు. యాదయ్యగౌడ్ పొలంలో నెల రోజుల కిందట వడ్ల సంచులను కోసి పారబోసిన అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏ పాపం ఎరుగని దివ్యాంగుడైన వృద్ధుడిని దారుణంగా హత్య చేయడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు.
తాజావార్తలు
- ప్రజలను దోచుకోవడంపై డీఎంకే, కాంగ్రెస్ నేతల మేథోమథనం : మోదీ
- రికార్డు స్థాయిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు : ఎమ్మెల్సీ కవిత
- పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు, ఆరుగురు దుర్మరణం
- ' ఉప్పెన' మేకింగ్ వీడియో చూడాల్సిందే
- మతిస్థిమితం లేని వ్యక్తిని.. కుటుంబంతో కలిపిన ఒక పదం
- రికార్డులు బ్రేక్ చేసిన అశ్విన్
- నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి: వెంకయ్య పిలుపు
- వీడియో : జపాన్ కేబినెట్ లో వింత శాఖ
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి !!
- సూరత్‌లో బీజేపీ కన్నా ఆప్‌కు ఎక్కువ ఓట్లు