ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Jan 18, 2021 , 00:12:19

వినూత్నకు సన్మానం

వినూత్నకు సన్మానం

వికారాబాద్‌, జనవరి 17 : చిన్న వయస్సులో జాతీయస్థాయిలో ఉత్తమ సేవాపురస్కార్‌ అవార్డును పొందడం ఈ ప్రాంతానికే గర్వకారణమని సామాజిక ఉద్యమ నాయకుడు పెండ్యాల అనంతయ్య, పీఆర్టీయూ మండల నాయకుడు నర్సింహులు అన్నారు. ఆదివారం వికారాబాద్‌లోని వారి నివాసంలో జాతీయ సేవా పురస్కార్‌ అవార్డును పొందిన చిన్నారి వినూత్నను సన్మానించి, సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా కాలంలో లాక్‌డౌన్‌ సమయంలో ఓ పక్క చదువుకుంటూనే, మరో పక్క విపత్కర పరిస్థితుల్లో సమాజానికి ఏదో చేయాలనే తపనతో తన వినూత్నమైన ఆలోచనలతో సామాజిక కార్యక్రమాలు చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంస్థలు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో చిన్నారి పాల్గొని తన సేవాతత్వాన్ని కొనసాగించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఆ చిన్నారి చేసిన సేవలను గుర్తించిన తెలంగాణ సెక్యులర్‌ ఫోరమ్‌ వారు గత సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో కొవిడ్‌-19 వారియర్‌, సోషల్‌ హీరో అవార్డు ప్రదానం చేశారని తెలిపారు. ఈ సంవత్సరం జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మదర్‌ ఇండియా వరల్డ్‌ రికార్డ్స్‌ వారు వినూత్న ప్రతిభను గుర్తించి జాతీయ ఉత్తమ సేవాపురస్కార్‌ అవార్డును ఆన్‌లైన్‌లో అందజేయగా, ఆ అవార్డును శుక్రవారం జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు వినూత్నకు అందించినట్లు పేర్కొన్నారు. 


VIDEOS

logo