మరిన్ని కేంద్రాల్లో టీకా

- ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్యారోగ్య శాఖ అధికారులు
పరిగి/షాబాద్, జనవరి 17 : కొవిడ్ టీకా వేసే కార్యక్రమం కొనసాగింపులో భాగంగా సోమవారం నుంచి జిల్లాలో అదనంగా మరో నాలుగు కేంద్రాల్లో టీకా వేసే కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 29 కేంద్రాల్లో కొవిడ్-19 టీకా వేయనుండగా తొలిరోజు మూడు కేంద్రాల్లోనే టీకా వేశారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 5,331 మంది వైద్య సిబ్బంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో 4,008 మంది ప్రభుత్వ, 1,323 మంది ప్రైవేటు వైద్య సిబ్బంది ఉన్నారు.
నేటి నుంచి అదనంగా నాలుగు కేంద్రాలు
వికారాబాద్ జిల్లా పరిధిలో అదనంగా మరో నాలుగు కేంద్రాలు చన్గోముల్, సిద్దులూరు, బషీరాబాద్, బొంరాస్‌పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బందికి టీకాలు వేయనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 50 మంది చొప్పున, జిల్లాలో 300 మందికి టీకాలు వేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
జిల్లాకు చేరుకున్న మరో వెయ్యి డోసులు
వికారాబాద్ జిల్లాకు మరో వెయ్యి డోసుల కొవిడ్-19 టీకా చేరుకున్నది. మొదటి విడుతలో 460 డోసుల వ్యాక్సిన్ జిల్లాకు చేరగా, రెండో విడుతలో ఆదివారం వెయ్యి డోసులు చేరవేశారు. జిల్లాకు మొదట 46 వాయిల్స్ వ్యాక్సిన్ రాగా, ఆదివారం 100 వాయిల్స్ వచ్చినట్ల్లు అధికారులు తెలిపారు. ఒక వాయిల్లో 5 మిల్లీ లీటర్ల వ్యాక్సిన్ ఉంటుంది. ఒక వ్యక్తికి 0.5 మిల్లీ లీటర్ల వ్యాక్సిన్ డోసు ఇవ్వనున్నారు. జిల్లాకు వచ్చిన కొవిడ్-19 వ్యాక్సిన్ వాయిల్స్‌ను అనంతగిరిలోని జిల్లా వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రంలో భద్రపరిచారు. జిల్లాలో గుర్తించిన 29 కేంద్రాల్లో టీకాలు ఇవ్వడానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో కేంద్రాల సంఖ్య త్వరలో పెంచనున్నారు.
రంగారెడ్డి జిల్లాలో..
మొదటి దఫా శనివారం ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ వేశారు. సోమవారం నుంచి అన్ని పీహెచ్‌సీల్లో టీకా వేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 59 ప్రభుత్వ దవాఖానలున్నాయి. మొదటి దఫా 9 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. మరో ఐదు కేంద్రాల్లో వ్యాక్సిన్ వేసేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున 14 కేంద్రాల్లో 700 మందికి టీకా వేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి తెలిపారు.
14 కేంద్రాల్లో వ్యాక్సినేషన్..
రంగారెడ్డిజిల్లాలో మొత్తం 14 కేంద్రాల్లో సోమవారం కొవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, షాద్‌నగర్, నార్సింగి, హఫీజ్‌పేట్, ఆమనగల్లు, కొండాపూర్, వనస్థలిపురం, మైలార్‌దేవ్‌పల్లితో పాటు కొత్తగా ఎంపిక చేసిన అబ్దుల్లాపూర్‌మెట్, సరూర్‌నగర్, బాలాపూర్, శేరిలింగంపల్లి, టీమ్స్ గచ్చిబౌలి దవాఖానల్లో వ్యాక్సిన్ వేయనున్నారు.
కొత్తగా ఐదు కేంద్రాల్లో వ్యాక్సిన్
9 కేంద్రాలతో పాటు మరో ఐదు కేంద్రాలు అబ్దుల్లాపూర్‌మెట్, సరూర్‌నగర్, బాలాపూర్, శేరిలింగంపల్లి, టీమ్స్ గచ్చిబౌలితో కలిపి మొత్తం 14 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున మొత్తం 700 మంది సిబ్బందికి టీకా వేస్తారు.
- స్వరాజ్యలక్ష్మి, రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
తాజావార్తలు
- వృద్ధులతో ప్రయాణమా..ఇలా చేయండి
- బీజేపీ దేశంలో విషం నింపుతుంది: శరద్‌పవార్
- ఈసారి ఐపీఎల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
- ‘అధికారులను కర్రతో కొట్టండి’.. కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- శ్రీశైలం.. ఆది దంపతులకు వరసిద్ధి వినాయకుడి పట్టు వస్త్రాలు
- ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
- ఈ మూడు సమస్యలే గుండె జబ్బులకు ముఖ్య కారణాలట..!
- బీజేపీలో చేరి ‘రియల్ కోబ్రా’ను అంటున్న మిథున్ దా
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్