శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Jan 17, 2021 , 00:05:40

విత్తనాలను త్వరగా నాటాలి

విత్తనాలను త్వరగా నాటాలి

  • వికారాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య

పెద్దేముల్‌ , జనవరి 16 : వన నర్సరీల్లోని ప్రైమరీ బెడ్లలో విత్తనాలను త్వరగా నాటాలని వికారాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని బండపల్లి గ్రామంలో వన నర్సరీ, కంపోస్టు షెడ్‌, పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి అనువైన స్థలాన్ని అధికారులు,  ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పరిధి నిర్వహణలో ఉన్న వన నర్సరీల్లోని ప్రైమరీ బెడ్లలో అన్ని రకాల విత్తనాలను త్వరగా నాటి సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా గ్రామాల్లో పూర్తికాని కంపోస్టు షెడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధంగా  చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మప్ప, ఏపీఎం నర్సింహులు, బండపల్లి సర్పంచ్‌ రమేశ్‌, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

VIDEOS

logo