సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Jan 16, 2021 , 00:11:23

ఓటర్ల తుది జాబితా విడుదల

ఓటర్ల తుది జాబితా విడుదల

  • రంగారెడ్డిలో ఓటర్లు 30,98,341, వికారాబాద్‌ జిల్లాలో 8,98,423
  •  విడుదల చేసిన చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ అధికారి
  • వికారాబాద్‌ జిల్లాలో ఓటర్లు 8,98,423 మంది

పరిగి, జనవరి 15 : ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ అనంతరం శుక్రవారం తుది జాబితాను ప్రకటించింది. వికారాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 8,98,423 మంది ఓటర్లుగా తుది జాబితాను విడుదల చేసింది. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1130 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో నవంబర్‌ 16వ తేదీన ప్రకటించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో మొత్తం 8,96,777 మంది ఓటర్లు ఉండగా, జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదు, మార్పులు, తొలగింపుల అనంతరం శుక్రవారం తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా కొత్తగా 2,663 మంది ఓటర్లుగా కొత్తగా నమోదవ్వగా, 1017 మంది పేర్లు తొలగించారు. దీంతో తుది జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,98,423 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో నవంబర్‌ 16వ తేదీ నాటికి మొత్తం ఓటర్లు 2,38,670 మంది ఉండగా, కొత్తగా ఓటర్లుగా 785 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 895 మంది పేర్లు తొలగించారు. తద్వారా తుది జాబితాలో పరిగి నియోజకవర్గంలో 2,38,560 ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. గతంలో కంటే 110 మంది ఓటర్లు తగ్గడం గమనార్హం. వికారాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో నవంబర్‌ 16వ తేదీ రోజు ప్రకటించిన డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌లో 2,22,765 మంది ఓటర్లుండగా, నూతనంగా 611 మంది కొత్త ఓటర్లుగా జాబితాలో చేరగా, 15 మంది పేర్లు తొలగించారు. తుది జాబితాలో వికారాబాద్‌లో 2,23,361 మంది ఓటర్లుగా ప్రకటించారు. తాండూరు నియోజకవర్గంలో నవంబర్‌ 16వ తేదీ నాటికి 2,19,667 మంది ఓటర్లుండగా కొత్తగా 692 మంది ఓటర్లు జాబితాలో చేరగా, 15 మంది పేర్లు తొలగించారు. దీంతో తుది జాబితాలో తాండూరు నియోజకవర్గంలో 2,20,344 మంది ఓటర్లుగా ప్రకటించారు. కొడంగల్‌ నియోజకవర్గంలో నవంబర్‌ 16వ తేదీ నాటికి 2,15,675 మంది ఓటర్లుండగా కొత్తగా 575 మంది పేర్లు చేర్చారు. 92 మంది పేర్లు తొలగించడంతో తుది జాబితాలో కొడంగల్‌ నియోజకవర్గంలో 2,16,158 మంది ఓటర్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా కేవలం పరిగి నియోజకవర్గంలోనే ఓటర్ల సంఖ్య తగ్గగా, మిగతా మూడు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. 

VIDEOS

logo