మంగళవారం 09 మార్చి 2021
Vikarabad - Jan 16, 2021 , 00:11:23

ఆరా తీస్తూ..అభయమిస్తూ

ఆరా తీస్తూ..అభయమిస్తూ

  • కల్లు బాధితులకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలి
  • ఎక్‌మామిడిలో బాధితులను పరామర్శించిన మంత్రి సబితారెడ్డి

కల్లు బాధితులకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలి వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డినవాబ్‌పేట మండలం ఎక్‌మామిడిలో బాధితులను పరామర్శించిన మంత్రి అధైర్యపడొద్దు.. ఏమీ కాదు.. మెరుగైన వైద్యం అందిస్తాం.. ప్రాణాలకు ఎలాంటి ఢోకా ఉండదు. అంటూ కల్లు బాధితులకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి భరోసా కల్పించారు. బాధితులు పూర్తిగా కోలుకునేంతవరకు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య పరీక్షలు నిర్వహించి, కావాల్సిన వైద్య సేవలు అందించాలని నవాబ్‌పేట మండలంలో పర్యటించి  అధికారులను ఆదేశించారు.           

వికారాబాద్‌, జనవరి 15 : వైద్య సిబ్బంది గ్రామంలో అందుబాటులో ఉండి కల్లు బాధితులకు వైద్యపరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని నవాబుపేట మండలం ఎక్‌మామిడి గ్రామంలో కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులను మంత్రి పరామర్శించారు. బాధితులు అధైర్యపడొద్దని.. మెరుగైన వైద్యం అందిస్తామని వారికి భరోసానిచ్చారు. బాధితులు పూర్తిగా కోలుకునేవరకు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలని అదేశించారు. ప్రజల ఆరోగ్యం పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు కావాల్సిన సదుపాయాలను చూసుకోవాలని తెలిపారు. పిల్లలు ఏమి చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ గురుకుల బడుల్లో తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని వారి భరోసా కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను సర్కారు కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వ బడిలో చదివించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని కోరారు. కార్పొరేట్‌ విద్యకు పోయి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సునీతమహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పౌసుమిబసు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, అడిషనల్‌ కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, నవాబుపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ పోలీసు రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, సర్పంచ్‌ రఫి, నాయకులు ప్రకాశం, దేవయ్య పాల్గొన్నారు. 


VIDEOS

తాజావార్తలు


logo