బుధవారం 27 జనవరి 2021
Vikarabad - Jan 14, 2021 , 00:34:30

మెరుగైన వైద్యం అందించాలి

 మెరుగైన వైద్యం అందించాలి

  • కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌, జనవరి13 : ప్రభుత్వ ఏరియా దవాఖానలోని రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ పౌసుమి బసు వైద్యులకు సూచించారు. బుధవారం సాయంత్రం ఆకస్మికంగా కలెక్టర్‌ దవాఖానను సందర్శించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, నాలుగు రోజుల క్రితం కల్తీ కల్లు తాగి చికిత్స కోసం వచ్చిన రోగులను మరోసారి పరామర్శించి పరిస్థితిని తెలుసుకున్నామన్నారు. ప్రస్తుతం రోగులు కోలుకుంటున్నారని చెప్పారు. వారికి కావాల్సిన వైద్య సదుపాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. కలెక్టర్‌ గర్భిణితో మాట్లాడి దవాఖానలో నాణ్యమైన వైద్యం లభిస్తున్నదని భరోసా ఇచ్చారు.


logo