శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 14, 2021 , 00:34:30

యాసంగికి సమాయత్తం

యాసంగికి సమాయత్తం

  •  అనుకూలంగా వాతావరణ పరిస్థితులు
  •  నియోజకవర్గంలో పెరిగిన సాగు విస్తీర్ణం

 తాండూరు, జనవరి 13: గత యాసంగి ఒడిదుడుకులకు లోనైన పంటల సాగు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉం డనుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో నదులు, వాగు లు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటల్లోకి వర్షం నీరు చేరి నిండుకుండలను తలపిస్తున్నాయి. భూగర్భజలాలు సమృద్ధిగా ఉండడంతో వరి సాగు పెరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 3వేల ఎకరాల్లో వేరుశనగ, 2500 ఎకరాల్లో శనగ పంటలను సాగు చేస్తున్నారు. ఈ పైర్లు ప్రస్తు తం కలుపుతీత దశలో ఉన్నాయి. మరోవైపు రైతుబంధు ద్వారా ఏడాదిలో రెండు విడుతలుగా రూ.10 వేలు పెట్టుబడి సాయం అందించడంతో రైతులు వ్యవసాయాన్ని పం డుగలా చేస్తున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు తాం డూరు నియోజకవర్గంలోని 43వేల మంది రైతులకు రూ. 68 కోట్లు సర్కార్‌ కేటాయించింది.

22 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు

 తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్‌, బషీరాబాద్‌, యాలాల మండలాల్లో యాసంగి పంటగా 22 వేల ఎకరాల్లో వరి సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో అత్యధికంగా యాలాల మండలంలో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఆ తరువాత పెద్దేముల్‌ మండలంలో కూడా రైతులు వరి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. తాండూరు, బషీరాబాద్‌ మండలాల్లో మాత్రం కాస్త తక్కువ విస్తీర్ణంలో వరి పంట ను రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు అధికం గా కురవడంతో నియోజకవర్గంలోని చెరువులు, బావులు, చెక్‌డ్యాంలు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో  చెరువులు, బావులు, కుంటల కింద ఉన్న ఆయకట్టులో రైతులు సంతోషంతో వరిపంట సాగు చేస్తున్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు కింద పెద్దేముల్‌ మండలం, జుంటుపల్లి ప్రాజెక్టు కింద యాలాల మండలంలో మొదటి పంటగా రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు.

నాటు దశ కీలకం

 బషీరాబాద్‌, జనవరి13: వరి సాగులో నారు పెంపకం, నా టుదశ కీలకం. నారు మడి కట్టినప్పటి నుంచి 25 రోజుల లో పు నాటు వేస్తే నారు త్వరగా కుదురుకుంటుంది. అంతేగాక పిలకలు ఎక్కువగా వచ్చే ందుకు అవకాశం ఉంటుంది. నాటు వేసేప్పుడు నారు కొనలు చిదిమి నాటు వేసుకోవాలి. దీంతో కాండం తొ ల్చు పురుగులు గుడ్లు పెడితే పోతాయి. నాటు ఎక్కవ లో తులో కాకుండా పైన్నే వేసుకోవాలి. ఎరువులు సమపాళ్లలో చల్లుకోవాలి ఎక్కువ మోతాదులో చల్లుకుంటే భూ మి సహజత్వం కోల్పోతుంది. - ఏవో, నాగం కృష్ణ


VIDEOS

logo