తెలంగాణ జాగృతి లక్ష్యం

- సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే
- మున్సిపల్ చైరపర్సన్ మంజుల
- బ్లాక్ గ్రౌండ్లో ముగ్గుల పోటీలు
వికారాబాద్, జనవరి 12: సంస్కృ తి, సంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే తెలంగాణ జాగృతి లక్ష్యమని వికారాబా ద్ మున్సిపల్ చైరపర్సన్ మంజుల అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.నవీనాచారి సూచనల మేరకు తెలంగాణ జాగృతి వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు పెద్ది పుణ్యవతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంజుల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. దేశ విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సగర్వంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత నాయకత్వంలో ఆనాడు జాగృతి చేసిన పోరాటమే కారణమన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, తెలంగాణ జాగృతి నాయకుడు అంజయ్య, తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శ్రీనివాస్, మహేశ్, ఆనంద్, రమేశ్‌నాయక్, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.