గురువారం 25 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 12, 2021 , 00:08:48

సీఎం కేసీఆర్‌తో మంత్రి నిరంజన్‌ రెడ్డి,

సీఎం కేసీఆర్‌తో మంత్రి నిరంజన్‌ రెడ్డి,

కొడంగల్‌పై వరాల జల్లు

  • ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కొడంగల్‌, జనవరి 11: నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లానని, సమస్యలను ఆయన సానుకూలంగా విని స్పందించి వరాల జల్లు  కురిపించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని దుద్యాల, గుండుమాల్‌ కొత్త మండలాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని సీఎస్‌కు సీఎం ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల్లో కొత్తగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు,  కొడంగల్‌లో బంజారాభవన్‌ నిర్మాణానికి అంగీకారం తెలిపారన్నారు. కొడంగల్‌కు మంజూరైన గురుకులాలు వేర్వేరు కారణాలతో  ఇతర ప్రాంతాలకు తరలించారని వివరించగా.. తిరిగి వాటిని కొడంగల్‌లో ఏర్పాటు చేసేందుకు హామీ ఇచ్చినట్టు తెలిపారు. కోస్గిలో నిర్మాణంలో ఉన్న బస్‌డిపోకు మరిన్ని నిధులు అందిస్తామని, స్థానిక ప్రభుత్వ దవాఖాన కొత్త భవనానికి వెంటనే బిల్లులు చెల్లిస్తామని, త్వరలో  ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రూ.10కోట్లతో కోస్గి నుంచి సజ్జఖాన్‌పేట రోడ్డు విస్తరణ చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలపై కురిపించిన వరాల జల్లుకు ప్రత్యేకంగా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మె ల్యేతో పాటు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్యాసం రామకృష్ణ  ఉన్నారు.  

VIDEOS

logo