బుధవారం 24 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 12, 2021 , 00:09:02

పకడ్బందీగా సర్వే చేపట్టాలి

పకడ్బందీగా సర్వే చేపట్టాలి

  • మక్తవెంకటాపూర్‌ భూముల సర్వేను పరిశీలించిన డీటీడబ్ల్యూవో కోటాజీ

కులకచర్ల, జనవరి11 : కులకచర్ల మండల పరిధిలోని మక్తవెంకటాపూర్‌ గ్రామంలో అటవీశాఖ పరిధిలో ఉన్న భూములపై నిర్వహిస్తున్న సర్వేను డీటీడబ్ల్యూవో కోటాజీ పరిశీలించారు. మక్తవెంకటాపూర్‌ గ్రామ పరిధిలోని అటవీశాఖ పరిధిలో చాలా మంది గిరిజనులకు ఇచ్చిన పట్టాల్లో సాగు చేస్తుండగా భూమి తమ అటవీశాఖకు చెందుతుందని అటవీశాఖ అధికారులు కోర్టులో వేయగా, గిరిజనులు తమకు ప్రభుత్వం భూమి కేటాయించిందని ప్రభుత్వానికి తెలియజేయడంతో ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు భూమి అటవీశాఖకు చెందినదా..? సాగుచేస్తున్న గిరిజనులదా..? ఎంతభూమి అటవీశాఖకు చెందినది ఎంత..? భూమి గిరిజనులది అనే విషయాన్ని తెలుసుకునేందుకు రెవెన్యూ, అటవీశాఖ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో మక్తవెంకటాపూర్‌ గ్రామ సమీపంలో సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ సర్వేను డీటీడబ్ల్యూవో కోటాజీ పరిశీలించారు. పకడ్బందీగా సర్వేను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.  కార్యక్రమంలో ఫారెస్ట్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి విజయ్‌కుమార్‌, రాజేందర్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌, మక్తవెంకటాపూర్‌ గ్రామ సర్పంచ్‌ అనిత, గ్రామస్తులు పులిరాములు, వెంకట్‌, వెంకట్‌నాయక్‌, రెడ్యానాయక్‌, హన్మంతు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. 

VIDEOS

logo