స్వచ్ఛతకు పాటుపడుదాం

- వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్, జనవరి 11: చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త డబ్బాల్లోనే వేసి స్వచ్ఛ వికారాబాద్‌గా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో 2021 స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛత ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతోపాటు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ పట్టణాన్ని స్వచ్ఛతగా తీర్చిదిద్దుకోవడానికి ప్రజలు, వీధి వ్యాపారులు, దుకాణదారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా కేంద్రంలోని 33వార్డుల్లో ప్రతి రోజూ చెత్తను మున్సిపల్ సిబ్బంది సేకరిస్తున్నారని తెలిపారు. ప్రతి వార్డులో చెత్తను రోడ్లపై పారవేయకుండా చెత్త డబ్బాల్లో వేస్తే మున్సిపల్ సిబ్బంది తీసుకువెళ్తారన్నారు. మున్సిపల్ అభివృద్ధికి ప్రజల తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. ప్రతి ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ముందు వరుసలో ఉంటున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా అన్ని మున్సిపాలిటీల్లో కంటే అధిక మార్కులు సాధించేందుకు కృషి చేద్దామన్నారు. వార్డుల్లో ఎక్కడైనా మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరణకు రాకపోతే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, వార్డు కౌన్సిలర్లు సురేశ్, రమణ, అనంత్‌రెడ్డి, నాయకులు విజేందర్‌గౌడ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- బోనస్ ఆశచూపి.. ముంచేస్తారు..
- వెలుగులోకి మరో చైనీయుల కుంభకోణం
- మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి
- మహిళా పోలీస్ సేవలు భేష్
- అమ్మ లేనిదే ప్రపంచం లేదు.. ఆమె కీర్తి ప్రగతికి స్పూర్తి
- పోర్టర్లకు ఉచిత బస్సుపాసులు
- సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం
- సంగీతంపై మక్కువతో..గళార్చన..
- తమిళనాడులో బీజేపీకి 20 సీట్లు