మంగళవారం 02 మార్చి 2021
Vikarabad - Jan 11, 2021 , 00:19:59

పెరుగుతున్న బాధితులు

పెరుగుతున్న బాధితులు

  • పరిగి దవాఖానకు పంపుతున్న వైద్యులు
  • బాధితులను పరామర్శించిన పలువురు నాయకులు, అధికారులు

వికారాబాద్‌, జనవరి 10: రెండు రోజులుగా జిల్లాలోని నవాబుపేట, వికారాబాద్‌ మండలాల్లో కల్తీ కల్లు తాగి దవాఖానల పాలవుతున్నారు. శనివారం రోజు 11 గ్రామాల్లో 147 మంది కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానకు వచ్చారు. అందులో ఒకరు మృతి చెందా రు. ఆదివారం మళ్లీ ఈ గ్రామాల నుంచే మరికొంత మంది బాధితులు వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఇప్పటికే వికారాబాద్‌ ఏరియాలో బెడ్లు సరిపోక వేరే దవాఖానలకు తరలించారు. అక్కడ కూడా బెడ్లు సరిపోకపోవడంతో పరిగి నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బాధితులను తరలిస్తున్నారు. 

రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి

ఎంపీ రంజిత్‌రెడ్డి

వికారాబాద్‌ ప్రభుత్వ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను ఎంపీ రంజిత్‌రెడ్డి పరామర్శించారు. వారికి నాణ్యమైన వైద్యం అందించాలని దవాఖాన సూపరింటెండెంట్‌ యాదయ్యకు సూచించారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఉన్నారు. 

బాధితుల బాగోగులను తెలుసుకున్న 

ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌

ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో రెండు రోజులుగా చికిత్స పొందుతున్న బాధితులను ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ పరామర్శించారు. రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. 

బాధితులు కోలుకుంటున్నారు.. 

కల్లు తాగి కండ్లు తిరిగి పడిపోయిన రోగులు భయపడొద్దని, త్వరగా కోలుకుంటారని ఎమ్మె ల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ భరోసా కల్పించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించి భరోసా కల్పించారు. 

అంబులెన్స్‌ సౌకర్యం కల్పించిన మాజీమంత్రి 

రెండు మండలాల్లో కల్తీ కల్లు బారినపడి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన సేవలు అందించేందుకుగాను 108 అంబులెన్స్‌ సౌకర్యాన్ని మాజీ మంత్రి డాక్టర్‌ ఏ.చంద్రశేఖర్‌ కల్పించారు. దీంతో బాధితులు అంబులెన్స్‌లో దవాఖానకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. అనంతరం బాధితులను పరామర్శించారు.

VIDEOS

logo