మన సంస్కృతిని భావితరాలకు తెలుపాలి

- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పరిగి, జనవరి 10 : మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సతీమణి ప్రతిమారెడ్డి నేతృత్వంలో ఆదివారం పరిగిలోని మార్కెట్‌యార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పండుగలతోపాటు సంస్కృతిపై రాబోయే తరాలకు వారధులుగా నేటి తరం నిలువాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న పిల్లలకు మన పండుగలు, వాటి ప్రాశస్త్యాలను తెలియజేయాలని ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి ముగ్గురికి నగ దు బహుమతులు అందజేసి వచ్చే సంవత్సరం మహిళల కు 5, చిన్నారులు 5 మందికి బహుమతులు అందజేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా సుజాతకుప్రథమ బహుమతి రూ.10వేలు, సరితకు ద్వితీయ బహుమతి రూ.5వేలు, సుశీలకు తృతీయ బహుమతి రూ.3 వేలు నగదు బహుమతులను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి-ప్రతిమారెడ్డి దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, పరిగి, పూడూరు జడ్పీటీసీలు హరిప్రియ, మేఘమాల, ఎంపీపీ అరవిందరావు, పీఏసీఎ స్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మహిళల సృజనాత్మకతను వెలికితీస్తాయి
తాండూరు, జనవరి 10: మహిళల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఆర్యవైశ్య మహిళ జిల్లా విభాగం ఆధ్వ ర్యంలో ఆదివారం తాండూరులో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. వంద మందికి పైగా మహిళలు, యువతులు, విద్యార్థినులు పోటీ పడి రంగు రంగుల ముగ్గులు వేశారు. న్యాయ నిర్ణేతలు ముగ్గులను పరిశీలించి విజేతలను ఎన్నిక చేశారు. అనంతరం మొదటి బహుమతి సాధించిన ఇంద్రజకు ఫ్రిజ్, రెండో బహుమతి సాధించిన మంజులకు వాషింగ్ మిషన్, మూడో బహుమ తి సాధించిన స్వప్నకు మిక్సీ, పోటీల్లో పాల్గొన్న అందరికీ ప్రోత్సాహక బహుమతులను తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మం జులతో పాటు ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలం గాణ సంస్కృతి, సంప్రదాయాల్లో సంక్రాంతి పండుగ ముఖ్యమైందన్నారు. ఆర్యవైశ్య మహిళ విభాగం ఆధ్వర్యం లో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు.
తాజావార్తలు
- వామపక్షాల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జి ..వీడియో
- మేడిన్ ఇండియా వ్యాక్సిన్ తీసుకున్న నేపాల్ ఆర్మీ చీఫ్
- బాలిక డ్రెస్ పట్ల అభ్యంతరం.. స్కూల్ నుంచి ఇంటికి పంపివేత
- పెద్దగట్టు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి జగదీశ్ రెడ్డి
- మోదీకి కొవాగ్జిన్.. కొవిషీల్డ్ సామర్థ్యంపై ఒవైసీ అనుమానం
- ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్!
- సీతారాముల కల్యాణానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి
- విద్యార్థులతో కలిసి రాహుల్‌గాంధీ పుష్ అప్స్, డ్యాన్స్.. వీడియోలు
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్