గురువారం 25 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 11, 2021 , 00:20:10

గెలుపోటములను క్రీడాస్ఫూర్తితో స్వీకరించాలి

 గెలుపోటములను క్రీడాస్ఫూర్తితో స్వీకరించాలి

  పరిగి, జనవరి 10: క్రీడాకారులు గెలుపోటములను క్రీడాస్ఫూర్తి తో తీసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత టీఆర్‌ఎస్‌ నేత అల్వాల పృథ్వీరాజ్‌ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆదివారం పరిగిలోని మినీ స్టేడియంలో ఎమ్మెల్యే ప్రా రంభించారు. అల్వాల పృథ్వీరాజ్‌ అందరితో కలివిడిగా ఉంటూ క్రమశిక్షణ గల కార్యకర్తగా పేరు సంపాదించాడని అన్నారు. ఈ సందర్భంగా దివంగత పృథ్వీరాజ్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎ స్పీ శ్రీనివాస్‌, సీఐ లక్ష్మీరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌, ఎంపీపీ అర విందరావు, జడ్పీటీసీ హరిప్రియ, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, మేడిద రాజేందర్‌, ఆంజనేయులు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌కుమార్‌, గోపాల్‌, ప్రభాకర్‌గుప్తా, భాస్కర్‌, వెంకటయ్య, సంతోష్‌, జీ.రాంరెడ్డి, పృథ్వీ రాజ్‌ తల్లిదండ్రులు బాలమణి, బాలస్వామి పాల్గొన్నారు. 

 పెద్దేముల్‌, జనవరి 10: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడు తాయని హన్మాపూర్‌ గ్రామ సర్పంచ్‌ సుమలత అన్నారు. ఆదివా రం మండల పరిధిలోని హన్మాపూర్‌ గ్రామ పంచాయతీ వెనుకాల ఉన్న మైదానంలో సర్పంచ్‌ సుమలత ఆధ్వర్యంలో గ్రామస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ క్రీడల వలన మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. కార్య మ్రంలో టోర్నమెంట్‌ ఆర్గనైజర్లు వెంకటేశ్‌, శేఖర్‌, రాములు, వార్డు సభ్యుడు రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo