శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Jan 11, 2021 , 00:20:19

బంజారా భవన్‌ నిర్మాణానికి బోరు మంజూరు

బంజారా భవన్‌ నిర్మాణానికి బోరు మంజూరు

కొడంగల్‌ : పట్టణానికి సమీపంలోని సిద్దనొంపు వద్ద తాలూకా బంజారా భవన్‌ నిర్మాణానికి బోరు వేయడానికి జడ్పీ చైర్‌పర్సన్‌ రూ.1.80లక్షలు నిధులు మంజూరు చేశారని బొంరాస్‌పేట జడ్పీటీసీ చౌహాన్‌ అరుణాదేశు, తాలూకా సేవాలాల్‌ మహారాజ్‌ సంఘం అధ్యక్షుడు దేశ్యానాయక్‌ తెలిపారు. ఆదివారం సిద్దనొంపు వద్ద బంజారా భవన్‌ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో పూజలు చేసి బోరు వేయగా పుష్కలంగా నీళ్లు వచ్చాయని వారు తెలిపారు. బోరు వేయడానికి నిధులు మంజూరు చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ను కోరిన వెంటనే నిధులు మంజూరు చేశారని జడ్పీటీసీ అరుణాదేశు తెలిపారు. కార్యక్రమంలో బొంరాస్‌పేట ఎంపీపీ హేమీబాయి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు టీటీ రాములు, ఢాక్యానాయక్‌, సోంనాథ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo