పరిగిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
- టీచర్స్‌కాలనీలో సీసీ రోడ్లు, కల్వర్టు, ఎర్రగడ్డపల్లిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు ప్రారంభం
పరిగి, జనవరి 9 : పరిగి పట్టణ ప్రగతికి ప్రత్యేక కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. శనివారం పరిగి పట్టణంలోని టీచర్స్‌కాలనీలో రూ.10.10లక్షలతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్లు, కల్వ ర్టు, ఎర్రగడ్డపల్లిలో రూ.10.10లక్షలతో నిర్మాణం చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి వార్డులో మున్సిపల్ నిధులతో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని, పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరు చేసిన రూ. 15 కోట్లకు సంబంధించి రూ.10 కోట్ల విలువ చేసే పను లు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు.
మార్కెట్‌యార్డులో డబ్బాల ఏర్పాటు..
పరిగిలోని గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నందున, కొ న్ని డబ్బాలు ఏర్పాటు చేసేందుకు ప్రత్యామ్నాయంగా మార్కెట్‌యార్డులో స్థలం కేటాయిస్తామని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం మార్కెట్ యార్డు లో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డబ్బాల య జమానులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ యార్డులో 22 డబ్బాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఆర్టీసీ యాజమాన్యం సైతం త్వరలోనే దుకాణాల సముదాయం నిర్మాణానికి టెండర్లు పిలుస్తుందని, దుకాణాల నిర్మాణం చేపడితే గంజ్రోడ్డులోని డబ్బాల వారికి ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఏ ఒక్కరినీ రోడ్డున పడనివబోమని, అందరినీ ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. పట్టణంలోని రోడ్ల అభివృద్ధికి అన్ని వర్గాల వారు తమ వంతు సహకారం అందించాలని సూచించారు. పరిగిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు సైతం కృషి చేస్తామని ఎమ్మె ల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ అరవిందరావు, పీఏసీఎస్ చైర్మ న్ శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌కుమార్, గోపాల్, ప్రభాకర్‌గుప్తా, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, కౌన్సిలర్లు రవీంద్ర, నాగేశ్వర్రావు, కిరణ్, బద్రుద్దీన్, వెంకటేశ్, రవికుమార్, మౌలానా, శేఖర్, తాహెర్‌అలీ, లక్ష్మి పాల్గొన్నారు.