సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Jan 09, 2021 , 00:28:31

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరికలు

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరికలు

  •  ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌
  •  రాళ్లచిట్టంపల్లి ఎంపీటీసీ టీఆర్‌ఎస్‌లో చేరిక

వికారాబాద్‌, జనవరి 08 :  ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని, పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని రాళ్లచిట్టంపల్లి ఎంపీటీసీ జగదాంబ కాంగ్రెస్‌ని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా  కార్యకర్తలు కృషి చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, పీఎసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, పార్టీ అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, సర్పంచ్‌ సంఘం మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, నాయకులు సత్తయ్యగౌడ్‌, రాళ్లచిట్టంపల్లి సర్పంచ్‌ ముప్లయిస్‌బేగం, ఉపసర్పంచ్‌ శంశొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

దైవచింతన కలిగి ఉండాలి

మర్పల్లి, జనవరి 08 : ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి, నవగ్రహ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు దేవాలయాలకు వెళ్లడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌, జడ్పీటీసీ మధుకర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఆయ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo