ఆ మహిళ తాండూరు వాసి..

- 8 రోజుల కిందట జూబ్లీహిల్స్‌లో అదృశ్యం
- ఐదు రోజుల క్రితం ఘట్కేసర్లో హత్య
- నిందితుల కోసం పోలీసుల గాలింపు
బంజారాహిల్స్, జనవరి 8: జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో 8 రోజుల కిందట కనిపించకుండా పోయి.. ఐదు రోజుల క్రితం ఘట్కేసర్ వద్ద దారుణ హత్యకు గురైన మహిళది వికారా బాద్ జిల్లా తాండూరని, పేరు వెంకటమ్మ అని తేలింది. వివరాల్లోకి వెళితే... తాండూరులోని హస్తిపురం ప్రాంతానికి చెం దిన కావలి అనంతయ్య, వెంకటమ్మ (50) దంపతులు బతు కు దెరువుకోసం ఐదేండ్ల క్రితం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని వెంకటగిరిలో జ్ఞానక్షేత్ర స్కూల్ సమీపం లో ఓ భవనంలో వాచ్మన్లుగా పనిచేస్తున్నారు. కాగా గత నెల 30న ఇంట్లోంచి బయటకు వెళ్లిన వెంకటమ్మ..తిరిగి రాలేదు. దీంతో ఈ నెల 1న తన ఆమె భర్త అనంతయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెంకటమ్మ సెల్‌ఫోన్ లొకేషన్లను పరిశీలించగా.. గత నెల 30న బేగంపేట ప్రాంతంలో ఆమె చివరిసారిగా ఫోన్ మాట్లాడినట్లు గుర్తించారు.. ఇదే క్రమంలో.. ఐదురోజుల క్రితం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ మహిళను హత్య చేసిన నిందితులు గుర్తు పట్టకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. పాక్షికంగా కాలిపోయిన ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్న క్రమంలో.. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసు విషయం తెలిసిం ది. మృతురాలి చీర కొంగులో ఓ ఫోన్ నంబర్ దొరకడంతో.. దాని ఆధారంగా నేరేడ్మెట్కు చెందిన చెన్నయ్య అనే వ్యక్తితో చివరిసారిగా మాట్లాడిన విషయం తేలింది. అయి తే.. వెంకటమ్మతో తనకు పరిచయం ఉన్నమాట వా స్తవమేనని, గత నెల 30న చివరిసారిగా తనకు ఫోన్ చేసింది కూడా నిజమేనని అంగీకరించాడు. అయితే తాను హత్య చేయలేదని చెన్నయ్య చెప్పినట్లు స మాచారం. వెంకటమ్మ ఎ వరితో వెళ్లి ఉంటుందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వెంకటమ్మ హత్య లో నిందితుల కోసం జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు ఘట్కేసర్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
తాజావార్తలు
- టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం
- పెట్రోల్‌పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఆర్‌యూపీపీ, ఎస్‌ఎల్‌టీఏ సంఘాలు
- పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
- అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం యజమాని మృతి
- ఎవరీ పద్మశ్రీ.. దిల్ రాజు ఎక్కడినుంచి పట్టుకొచ్చాడు..?
- రూ.43వేల దిగువకు బంగారం ధర..
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్‌కు రెడీ
- అందుకే పెద్ద సంఖ్యలో గురుకులాల స్థాపన
- .. ఆ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఉపసంహరణ