బుధవారం 24 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 09, 2021 , 00:28:33

‘అభివృద్ధి’ బాటలో మున్సిపాలిటీ

‘అభివృద్ధి’ బాటలో మున్సిపాలిటీ

  •  తాండూరులో 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న రూ. 4.50 కోట్ల పనులకు మోక్షం 
  •  నూతనంగా మరో 3.93 కోట్లు పనులకు టెండర్లు  
  • మున్సిపల్‌చైర్‌ పర్సన్‌ స్వప్న 

 తాండూరు, జనవరి 8: తాండూరు మున్సిపల్‌ లో 2014 నుంచి 2020 వరకు పలు కాలనీల్లో రూ.4 కోట్ల 50 లక్షలతో పెండింగ్‌లో ఉన్న 67 పనులకు మోక్షం లభించింది. 2020 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 36 పెండింగ్‌ పనులు రూ.2 కోట్ల 53 లక్షలతో పూర్తికాగా మరో రూ. 1.97 కోట్లతో 31 పనులు ఇటీవల ప్రారంభిం చారు. తాండూరు మున్సిపల్‌ పరిధిలోని వార్డు ల్లో ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ము రుగు కాలువలు, సీసీ రోడ్ల పనులు ప్రస్తుతం చైర్‌ పర్సన్‌ స్వప్న పట్టుదలతో కాంట్రాక్టర్లు ముం దుకు వచ్చి చేయడంతో పట్టణ ప్రజలు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ అభివృద్ధికి తెలం గాణ సర్కార్‌ ప్రత్యేకంగా చేపట్టిన పట్టణ ప్రగతి లో భాగంగా తాండూరు మున్సిపల్‌కు ప్రతి నెల రూ.59 లక్షల నిధులు వస్తున్నాయి. దీంతో తాం డూరు మున్సిపల్‌ పరిధిలోని 36 వార్డుల్లో అభి వృద్ధి పనులు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఈ ఏడాది రూ.3 కోట్ల 93 లక్షలతో 128 పనులకు మున్సిపల్‌ పాలక వర్గం ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదం తెలిపిం ది. టెండర్లు పూర్తయిన పనులు త్వరలో ప్రారం భించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేగంగా జరు గుతున్న అభివృద్ధి పనులతో టీఆర్‌ఎస్‌ ప్రభు త్వానికి మంచి పేరు వస్తుందని ప్రతిపక్ష పార్టీలు కక్ష గట్టి లేనిపోని ఆరోపణలు చేస్తూ పనులు ఆ పేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సహకారంతో పార్టీ లకు అతీతంగా 36 వార్డుల్లో సమానంగా అభివృ ద్ధి పనులు చేయిస్తు న్నారు.

ఆదర్శ మున్సిపల్‌ ఏర్పాటు దిశగా...

 తాండూరును రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపల్‌గా చేసేందుకు ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సహకారంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న కార్యాచరణ చేపట్టారు. మున్సిపల్‌ జనర ల్‌ ఫండ్‌, ప్రత్యేక ఫైనాన్షియల్‌ ఫండ్‌తో పాటు పట్టణ ప్రగతి నిధులతో పార్కులు, రోడ్లు, మురు గు కాలువలో, లేట్లు, నర్సరీలు, వైకుంఠ ధామా లు తదితర అభివృద్ధి పనులు వేగంగా చేపడుతు న్నారు. 2021 డిసెంబర్‌ వరకు తాండూరు రూ పురేఖలు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయి. విస్తరిస్తున్న తాండూరు పట్టణ జనాభా తో పాటు పట్టణానికి వచ్చే జనాన్ని దృష్టిలో ఉం చుకుని పట్టణంలో నాలుగు చోట్ల నిర్మించిన షీ టాయిలెట్ల సమీపంలోనే మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ స్వప్న ప్రత్యేక ఆలోచనతో బాలింతలు పసి పాప లకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు తాండూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన షీ టా యిలెట్లలో మూత్రశాల, మరుగుదొడ్డి ఇబ్బందు ల పరిష్కారంతో పాటు బాలింతల ఇబ్బందుల ను దూరం చేస్తున్నాయి. దీంతో పాటు జనరల్‌ స్టోర్‌ను కూడా నిర్మించి ఓ కుటుంబం స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తున్నది.  

పార్టీలకు అతీతంగా తాండూరు అభివృద్ధికి కృషి

రాజకీయ పార్టీలు, కులమతాలకు అతీతంగా తాండూరు అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నాం. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా శ్రమిస్తున్నాం. అందరి సహకారంతో ఈ ఏడాది చివరి వరకు తాండూరును సర్వాంగ సుందరంగా మారుస్తాం. అభివృ ద్ధి పనుల్లో నాణ్యత లోపించకుండా, అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా వేగంగా పనులు పూర్తి చేస్తాం. టీఆర్‌ఎస్‌ పాలనలో జరుగుతున్న చక్కటి అభివృద్ధిని చూసి ప్రతి పక్షాలు ఓర్వలేకున్నాయి. ప్రతి విషయంలో అడ్డంకులు చెబుతున్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తు కాలం వృథా చేస్తున్నారు. నిత్యం ప్రజలతోనే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నాం. -స్వప్న, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, తాండూరు

VIDEOS

logo