నవాబుపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

- శుభోదయం కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
వికారాబాద్, జనవరి 6 : నవాబుపేట మండలాన్ని నియోజవకర్గంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం శుభోదయం కార్యక్రమంలో భాగంగా మణిక్యప్రభు ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం నవాబుపేట మండల కేంద్రంతో పాటు ఎత్రాజ్పల్లి, దాతాపూర్, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని అడిగారు. అనంతరం దాతాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని నవాబుపేట మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చితిద్దుతామని ఆయన అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా తిమ్మరెడ్డిపల్లి గ్రామం నుంచి మీనేపల్లి కాలన్కు వెళ్లేదారిలో రైతుల పంట పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పర్మిషన్ రోడ్డు కావాలని ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఆయన స్పందిస్తూ త్వరలో నిధులు మంజూరు చేసి రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. దాతాపూర్ గ్రామం నుంచి పులుమామిడి వెళ్లేందుకు ఉన్న మట్టి రోడ్డును పర్మిషన్ రోడ్డుగా మార్చాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరగా, వెంటనే రూ.5లక్షలు నిధులు మంజూరు చేస్తామన్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని పంచాయతీరాజ్ ఏఈ లక్ష్మయ్యకు ఆదేశించారు. యవాపూర్, ఆర్కతల, నవాబుపేట, ఎత్రాజ్పల్లి గ్రామ్లాలో విద్యుత్ తీగలు ఇండ్లపై వేలాడుతున్నాయని, పలుమార్లు సంబంధిత ఏఈ దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆయన స్పందిస్తూ ఏఈని సమస్యను పరిష్కరించాలని హెచ్చరించారు. నవాబుపేట మండల కేంద్రంలో 2వార్డులో కరెంట్ స్తంభాలు లేని చోట కొత్త స్తంభాలు అమార్చాలని ఆదేశించారు. శుభోదయం కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న సమస్యలు మాత్రమే తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. అండర్‌డ్రైనేజీ, పింఛన్లు, సీసీరోడ్డు, విద్యుత్ తీగలు సరిచేయాలని ప్రజలు తమకు చెప్పారని చెప్పారు. త్వరలో ఇలాంటి సమస్యలకు చరమగీతం పాడుతామన్నారు. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తులు ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయా లేదా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భవాని, జడ్పిటీసీ జయమ్మ, వైస్ ఎంపీపీ బందయ్యగౌడ్, పీఎసీఎస్ చైర్మన్ పోలీసు రాంరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి, చిట్టెపు మల్లారెడ్డి, తాసిల్దార్ బుచ్చయ్య, ఎంపీడీవో సుమిత్రమ్మ, ఏపీవో లక్ష్మీదేవి, టీఆర్ఎస్ నాయకుడు తిరుపతిరెడ్డి, దయాకర్‌రెడ్డి, ప్రకాశం, నర్సింహులు, గోపాల్, ఏసుదాసు, కుమార్, సర్పంచులు రత్నం, బల్వంత్‌రెడ్డి, ఎంపీటీసీ పద్మ పాల్గొన్నారు.
తాజావార్తలు
- దూకుడు పెంచిన వైష్ణవ్.. వరుస సినిమాలతో సందడి..!
- టిక్‌టాక్ మాదిరిగా ఫేస్బుక్ యాప్
- కాణిపాకం వినాయకుడికి రూ.7కోట్ల విరాళం
- పార్టీలో పాటకు స్టెప్పులు.. అదరగొట్టిన ఐపీఎస్ అధికారులు
- రాహుల్ వ్యాఖ్యలపై కాషాయ నేత కౌంటర్ : కాంగ్రెస్ అందుకే కనుమరుగైంది!
- బీజేపీకి రెండంకెల సీట్లూ రావు.. నా మాటకు కట్టుబడి ఉన్నా!
- యంగ్ హీరోకు అల్లు అర్జున్ సపోర్ట్.. !
- లక్షా 90 వేల కోట్ల డాలర్ల కోవిడ్ ప్యాకేజీకి ఆమోదం
- నాలుగో టెస్ట్ నుంచి బుమ్రా ఔట్.. ఇదీ కారణం!
- దారుణం : ఎఫ్బీలో ప్రైస్ట్యాగ్తో బాలిక ఫోటో అప్లోడ్ చేసిన మహిళ