ఇద్దరి ఆత్మహత్య

- యువకుడితో కలిసి వివాహిత బలవన్మరణం
కోట్‌పల్లి, జనవరి 6: మద్యం మత్తులో యువకుడితో కలిసి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోట్‌పల్లి పోలీస్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ధారూర్ సీఐ తిరుపతి రాజు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మం డలంలోని నాగసాన్పల్లి గ్రామానికి చెందిన బోయిని శ్రీశైలం (22), గతంలో హైదరాబాద్‌లో టిఫిన్ సెంటర్లో పని చేస్తుండేవాడు. లాక్డౌన్ నేపథ్యంలో సొంత గ్రామానికి చేరుకుని, కరాటే మాస్టర్ కావడంతో నాగసాన్పల్లి, మర్ధన్పల్లి గ్రామాల్లోని పిల్లలకు కరాటే నేర్పేవాడు. ఇందులో నాగసాన్పల్లి గ్రామానికి చెందిన లావణ్య (28) పిల్లలు కూడా వచ్చి కరాటే నేర్చుకునేవారు. అలాగా వీరిద్దరి మద్య పరిచయం ఏర్పడింది. 13 సంవత్సరాల క్రితం వికారాబాద్ గరీబ్ గనగర్ చెందిన లావణ్య, నాగసాన్పల్లి నాగరాజులకు వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు వరుణ్‌తేజ్ (10), తేజస్వీని (7). వీరు వికారాబాద్‌లో చదువుకుంటున్నారు. శ్రీశైలం ఆదివారం ఉదయం బావమరిది గ్రామం ఓగ్లా పూర్ గ్రామానికి వెళ్లి సోమవారం నాగసాన్‌పల్లికి వచ్చాడు. అదే రోజు సాయం త్రం లావణ్య, ఆమె భర్త నాగరాజు ఇంట్లో చిన్నపాటి గొడవ పడడంతో ఇద్దరికి శ్రీశైలం సర్దిచెప్పాడు. అదే రాత్రి 2.30 గంటలకు భర్త నాగరాజు లేచి చూడగా ఇంట్లో లావణ్య లేదు. బయటకెళ్లిందని అనుకున్నాడు. మంగళవారం ఉదయానికి కూడా ఎక్కడ సమాచారం రాలేదు. దాంతో బుధవారం వికారాబాద్ రామయ్యగూడకు వెళ్లి వెతుకుతుండగా లైఫ్ యూనివర్సిటీ సమీపంలోని పొలం గట్టున శ్రీశైలంతో పాటు లావణ్య మృతి చెంది ఉన్న సమాచారం రావడంతో గ్రామానికి తిరిగి వచ్చినట్లు నాగరాజు తెలిపారు. సంఘటన స్థలాన్ని సీఐ తిరుపతి రాజు, కోట్‌పల్లి ఎస్ఐ వెంకటనారాయణ పరిశీలించి పంచనామ నిర్వహించారు. శ్రీశైలం తండ్రి మొగులయ్య, లావణ్య భర్త నాగరాజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించి, అనంతరం కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సీఐ మాట్లాడుతూ సూసైడ్ నోటులో తామిద్దరం ఇష్ట పూర్వకంగానే చనిపోతున్నట్లు రాసి ఉందని తెలిపాడు.
తాజావార్తలు
- భారతదేశపు మొదటి అటవీ వైద్య కేంద్రం ప్రారంభం
- పదేండ్లలో చేయాల్సిన పనులు11 నెలల్లో పూర్తి చేశాం
- భారత అమ్మాయిల ఓటమి
- రైతులారా ఆశ కోల్పోవద్దు.. వంద నెలలైనా మీతో ఉంటాం: ప్రియాంక గాంధీ
- నిర్మాణ అద్భుతం దేవుని గుట్ట ఆలయం
- ఈ టీ తాగితే బరువు తగ్గొచ్చు
- జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్
- మార్చి 12 నుంచి ప్రచారం మొదలుపెడుతా: మిథున్ చక్రవర్తి
- కిడ్స్ జోన్లో ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో
- ఆగస్టు 31 నుంచి కార్లలో కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ మస్ట్.. మళ్లీ ధరలమోత!