శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 07, 2021 , 00:23:21

సర్వాంగ సుందరం

సర్వాంగ సుందరం

  • ప్రారంభోత్సవానికి సిద్ధంగా రైతు వేదికలు, ప్రకృతివనాలు
  • చూపరులను ఆకట్టుకుంటున్న కళాఖండాలు

కొడంగల్‌, జనవరి 6 : వ్యవసాయం దండుగ కాదు.. పండుగగా మార్చాలన్న సదుద్దేశంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలను నిర్మిస్తున్నది. నియోజకవర్గ పరిధిలో 22 క్లస్టర్లు ఉన్నాయి. కొడంగల్‌ మండలంలో 8 రైతు వేదికల నిర్మాణం కొనసాగుతుండగా.. 80 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులోభాగంగా పర్సాపూర్‌లో నిర్మించిన రైతు వేదికతో పాటు ప్రకృతివనం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. బొంరాస్‌పేట మండలంలో 6 రైతు వేదికలకుగాను నాగిరెడ్డిపల్లి, మెట్లకుంట గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు. దౌల్తాబాద్‌ మండలంలో 8 రైతు వేదికలకు 4 వేదికల నిర్మాణం పూర్తికాగా.. మరో 4 చోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రేగడిమైలారం రైతు వేదిక ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 

రైతు వేదికలు ప్రారంభం

కొడంగల్‌ మండలంలోని రైతు వేదికలను గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సునితామహేందర్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో  రెండు రైతు వేదికలు, పర్సాపూర్‌లోని పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించనున్నారు. 

ఆహ్లాదాన్ని పంచుకున్న ప్రకృతివనం 

యాలాల, జనవరి 5 : మండల కేంద్రంలో ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతుండగా.. రైతు వేదిక సర్వాంగసుందరంగా తయారై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది.. ప్రకృతి వనం ప్రహరీ మొదలుకొని వనంలో రాళ్లపైన వేసిన రంగురంగుల కళాఖండాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. చోటా భీమ్‌, విభిన్న జంతువుల చిత్రాలు పిల్లలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. 

VIDEOS

logo