సోమవారం 08 మార్చి 2021
Vikarabad - Jan 07, 2021 , 00:23:21

రైతుల ఆత్మగౌరవం రైతువేదికలు

రైతుల ఆత్మగౌరవం రైతువేదికలు

  • రైతు సమస్యలను చర్చించుకునే వేదిక
  • సంక్షేమ పథకాలను రైతు ముంగిట నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌ది..

యాలాల, జనవరి 6 : ప్రతి రైతు ఆత్మగౌరవంతో తలెత్తుకు జీవించాలనే సదుద్దేశంతో సంక్షేమ పథకాలను రైతు మంగిట నిలిపింది రాష్ట్ర సర్కార్‌. రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పథకాల అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో దూసుకుపోతున్నది. 

ప్రాధాన్యం..

రైతుల సమస్యలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కోసం రైతులకు ఓ చక్కటి వేదిక అవసరం. దీనిని గుర్తించిన ప్రభుత్వం గ్రామాల్లో క్లస్టర్ల వారీగా రైతు వేదిక నిర్మాణాలు చేపట్టింది.

24 గ్రామపంచాయతీ పరిధిలో..

యాలాల మండలంలోని 24 గ్రామపంచాయతీ పరిధిలో యాలాల, అగ్గనూర్‌, కోకట్‌, జుంటుపల్లి, రాస్నం క్లస్టర్లలో రైతువేదిక నిర్మాణాలను చేపట్టారు. ఇందుకు ప్రభుత్వం ఒక్కో రైతువేదిక నిర్మాణానికి రూ.22 లక్షలను వెచ్చిస్తున్నది. వ్యవసాయ శాఖ నుంచి రూ.12 లక్షలు, ఉపాధి హామీ నుంచి రూ.10 లక్షలు కేటాయించారు. ఒక్కో రైతు వేదికలో రెండు గదులు, ఒక పెద్ద సమావేశ గది,  మరుగుదొడ్ల నిర్మాణాలు ఉండే విధంగా రైతువేదిక నిర్మాణాలకు రూపకల్పన చేసింది. రాస్నం, అగ్గనూర్‌, కోకట్‌, జుంటుపల్లి, యాలాలలో రైతువేదిక నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమయ్యాయి. రైతువేదికల నిర్మాణ పనులను పంచాయితీరాజ్‌ డీఈ గోపినాథ్‌, ఏఈ రాంప్రసాద్‌రెడ్డిలతో పాటు మండలస్థాయి అధికారులు పర్యవేక్షించారు.

VIDEOS

logo