ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Jan 06, 2021 , 00:11:37

పరిగి సమగ్రాభివృద్ధికి కృషి

పరిగి సమగ్రాభివృద్ధికి కృషి

  • ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి  
  • పట్టణంలోని 7, 11 వార్డుల్లో నిర్మించిన సీసీ రోడ్లు,  డ్రైనేజీలు ప్రారంభం

 పరిగి, జనవరి 5: పరిగి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రూ.5 లక్షలతో పరిగిలోని 11వ వా ర్డు రాంనగర్‌లో, రూ.5.10 లక్షలతో 7వ వార్డులో నిర్మించిన సీసీ రోడ్డు పనులను మరియు అండర్‌ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి పట్టణంలో ప్రధాన రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.15 కోట్ల తో పనులు చేపట్టామన్నారు. ఈ పనులు పూర్తవగా నే మరో రూ.15కోట్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పూర్తిస్థాయిలో సహకారం అందజేస్తానని పరిగిని సుందర పట్టణంగా తీర్చిదిద్దడానికి అందరూ తమవంతుగా సహకారం అందించా లని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌, ఎంపీపీ అరవిందరావు, మాజీ ఎంపీ పీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గోపాల్‌, కౌన్సిలర్లు కృష్ణ,  కిరణ్‌, వెంకటేశ్‌, నాగేశ్వర్‌రావు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు ముకుంద శేఖర్‌, టీఆర్‌ఎస్‌ నేతలు రవికుమార్‌, మౌలానా, నయీం, ఆసిఫ్‌, అన్వర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ 

 పరిగి మండలంలో 9, కులకచర్ల మండలం 3, పూ డూరు మండలం 5, గండీడ్‌ మండలం 3, దోమ మండలానికి చెందిన ఒకరికి మొత్తంగా 21 మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరైన రూ.9.99 లక్షలకు సంబంధించిన చెక్కులను మంగళవారం పరిగిలోని తమ నివాసంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అందజేశారు.

VIDEOS

logo